మేమూ బాలలం
----------------------------------
భగవంతుని బిడ్డలం
బంగారు బాతులం
బడికెళ్ళు బాలలం
గుడిలోని గంటలం
బంతిపూల తావులం
చింతలేని జీవులం
భాస్కరుని వెలుగులం
భారతమ్మ వారసులం
భాగ్యానికి దారులం
బాల్యానికి రాజులం
బలుపు లేని బాలలం
గెలుపు దారి యోధులం
ప్రేమిస్తే బంధువులం
అనురాగ సింధువులం
తామరపై బిందువులం
తల్లిదండ్రుల ఆశలం
--గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు.