ప్రకృతిని చెరబడితే(కైతికాలు) రమేశ్ గోస్కుల

ప్రకృతిని చెరబడితే(కైతికాలు) రమేశ్ గోస్కుల

అడుగుతీసి అడుగేయ
అనుక్షణం భయమేరా
గాలి ధూళి తాకినా
గుండె మంట పెరిగేరా
ప్రకృతిని చెరబడితే
పాప భీతి తప్పునా

అడవుల్ని కూల్చేసి
అందని మేడలొ ఉంట్టె
బతికించే నీ శ్వాసే
నీ ఆయువు తుంచ బట్టె
ప్రకృతిని చెరబట్టి
సాధించిన దేమిటీ?

కుమ్మరి కుండలు వీడి
ప్లాస్టిక్ బిందెలు వాడె
క్యాన్సర్ల్ వచ్చెనని
ఆస్పత్రి నింపు వాడె
ప్రకృతిని చెరబట్టిన
ఫలితం మిగిలిన దేమి?

నీటి కొరకు వేల ఫీట్లు
నిట్ట నిలువు భూమి చీలు
ఎండమావి కాన రాక
బుగ్గి చేసే రవి కాంతులు
ప్రకృతిని చెరబట్టిన
ఫలితానికి ఉలికి పడె

అధిక పంట కాశ పడి
రంగు రసాయనం జల్లి
తినే కూడు విషమవగా
పడుతున్నాము తుల్లి
ప్రకృతిని చెరబడుతూ
రోగాలను వాటేస్తూ

సెల్ ఫోన్ తొ చెలిమి
చిరు జాతుల నులిమి
ప్రమాదమని తెలిసినా
గుండె బరువు పెంచితిమి
ప్రకృతిని చెరబడుతూ
పారవశ్యమందితిమి

అణువణువు ఆక్రమించి
అందలాలు పెంచితిమి
ఈకలు పీకిన కోడిల
ఇలనంత చేస్తిమి
ప్రకృతిని చెరబట్టి
కత్తుల బోణుల చేరితిమి

ఇంకా కళ్ళను మూయుచు
ఎన్నాళ్ళు దొరతనమోయి
ఇకనైనా కళ్లు తెరిచి
అడుగు ముందుకేయి
ప్రకృతిని చెరబడితే
ప్రమాద మెంతొ చూడోయ్

సహజత్వం సిద్ధించే
దారిలొ నడవాలోయ్
గుట్టలపై మేఘాలు
జల్లులవగ చూడాలోయ్
ప్రకృతిని విడిపించే
మార్గం నడవాలోయ్

తెగిన గాలిపటంలా
పుడమిని విడవద్దోయ్
తెగు వరకు లాగకుండ
తెలివి తోడ నడవ వోయ్
ప్రకృతిని  చెర విడిచి          మానులప్రాణుల కాపాడోయ్

పర్యావరణ దినోత్సవం  సందర్భంగా
           రమేశ్ గోస్కుల

0/Post a Comment/Comments