శీర్షిక: గురుశిష్యుల బంధం. పేరు: బి. యమున

శీర్షిక: గురుశిష్యుల బంధం. పేరు: బి. యమున

శీర్షిక:గురుశిష్యుల బంధం

మానవ వికాసగమనంలో గురుశిష్యుల బంధం చాలా గొప్పది. టెక్నాలజీ ఎంత పెరిగినా, టెక్నిక్ నేర్పేందుకు గురువుండాల్సిందే. గూగులమ్మల్లాంటివెన్నొచ్చినా
గురువు ముందు దుగదుడిపే. "గురువులేని విద్య గుడ్డి విద్య" అని పెద్దలానాడే చెప్పారు. గురువులవద్ద విద్య అభ్యసించిన వాళ్ళంతా మానసికంగా దృఢంగా ముందడుగు వేస్తారు. ఏ స్థాయిలో విద్య అభ్యసించిన మార్గం చూపేది గురువే.  చెప్పే ప్రతిమాట భవిష్యత్తుకు బాటవుతుందంటే అతిశయోక్తికాదు. మా ఉపాధ్యాయులు మాతో చాలా కలగొలుపుగా, అందరిని ప్రోత్సహిస్తూంటారు. ఎల్లవేళలా మా అభివృద్ధిని కాంక్షిస్తుంటారు. శ్రద్ధగా, ఏకాగ్రతతో, జిజ్ఞాస కలిగి విద్యనభ్యసిస్తే సులభంగా అనుకున్న గమ్యాన్ని అలవోకగా చేరుకుంటారు. 
విద్య మనకు అన్ని విషయాలపట్ల అవగాహన కల్పిస్తుంది. నిర్లక్ష్యం ఆవహించి, అయేమయంలో కొట్టుమిట్టాడుతున్న వేళ , తన ప్రేరణతో కొత్త ఉత్సాహాన్ని నింపేవాళ్ళు గురువులు. గురువుపట్ల ఎల్లప్పుడూ గౌరవబావాన్ని కలిగివుండాలి. వినయాన్ని ఆభరణంగా ధరించాలి. అంతేకాకుండా, గురువుల మాటలు వినేవాళ్ళుగా ఉండకూడదు. ఆచరించే మంచి మనసు కలిగివున్నప్పుడే, విజయాన్ని సులభంగా సాధించగలం. అందుకే అన్నారు, తల్లిదండ్రులు జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.
"గురువును గౌరవిద్దాం, బతకును దిద్దుకుందాం"

బి. యమున,
10వ , తరగతి,
జి.ప.ఉ.పా. అమడబాకుల,
వనపర్తి జిల్లా.

0/Post a Comment/Comments