ముత్యాల హారాలు-గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు

ముత్యాల హారాలు-గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు

ముత్యాల హారాలు
----------------------------------------
మాటల్లో సౌమ్యము
ఉంటేనే రమ్యము
చేరాలోయ్!! గమ్యము
చేధించాలోయ్!! మర్మము

కష్టపడితే సాధ్యము
విజయమిక నిశ్చయము
పెద్దవారి అనుభవము
చూపించును మార్గము

దుష్టలతో స్నేహమ్ము
గుండెల్లో శల్యమ్ము
పదునైన శూలమ్ము
అక్షరాల సత్యమ్ము

జీవితాన బాల్యము
అంతులేని భాగ్యము
అందమైన లోకము
పంచుతుంది నాకము
-గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments