పక్షుల గేయం--గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

పక్షుల గేయం--గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

పక్షుల గేయం
----------------------------------
గట్టు మీద చెట్టుపై
పిట్ట పిల్ల వాలింది
పట్టబోతే ప్రేమగ
ఇట్టే ఎగిరిపోయింది

కొలనులోని హంసమ్మ
కలువల మధ్య తిరిగింది
విలువైన మనసుతో
చెలిమి పంచిపెట్టింది

కొమ్మపై కోకిలమ్మ
కమ్మగా పాడింది
రెమ్మ వంటి మనసులకు
అమ్మ ప్రేమ తెలిపింది

చిట్టి చిలుకమ్మ ఒకటి
చెట్టుపై కూర్చుంది
పొట్టను జామపండ్లతో
పుష్టిగా తిని నింపింది

--గద్వాల సోమన్న ,
      ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments