బాపు బొమ్మలం(బాలగేయం )--గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు

బాపు బొమ్మలం(బాలగేయం )--గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు

బాపు బొమ్మలం
(బాలగేయం )
----------------------------------
చిన్నిచిన్ని మొలకలం
సన్నజాజి మొగ్గలం
కన్నవారి కనులలో
కదలాడే పాపలం

జాబిలమ్మ రూపులం
జామ చెట్టు ఫలములం
జగతి ప్రగతి బాటలం
జన్మభూమి రాజులం

మురిపించే మువ్వలం
ముద్దబంతి మాలలం
ముచ్చటైన బాలలం
ముద్దులొలుకు చిలుకలం

భగవంతుని పుత్రులం
భలే ! భలే ! మిత్రులం
బాపు కుంచె బొమ్మలం
బాపూజీ ఆశలం
--గద్వాల సోమన్న ,
      ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments