"ఋత్వం గేయం"
----------------------------------
వృక్షాలు పెంచితే !!
వృధా కాదు కష్టము
మృదువైన మాటలే !!
అమృతంతో సమానము
తృణప్రాయము అజ్ఞానము
తృప్తి కల్గి జీవించుము
కృప గల భగవంతునికి
కృతజ్ఞత చూపించుము
తృణీకరణ చెడ్డగుణము
మృగం వోలె దాడి చేయు
బృందావనం మేలుగుణము
వృద్ధిని కలుగజేయు
గృహమే స్వర్గధామము
గృహిణియే మణిదీపము
దృఢసంకల్పముంటే
మృత్యువే బహు దూరము
-గద్వాల సోమన్న