Pravahini

*నైతికాభివృద్దే నిజమైన అభివృద్ధి*
---------------------------------------
అభివృద్ధoటే
బతుకునిచ్చే విద్యాలయాలు
బతికించే వైద్యాలయాలు
సేవాభావంతో స్థాపించాలి గాని
శవాల మీద చిల్లరఎరుకొన్నట్టు
పన్నులపైకం కోసం
నాగరికులుండే మహానగరాల్లో 
నగర సంస్కృతిలో భాగంగా
పబ్బులు
క్లబ్బులు
రిసార్టులు
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి

అప్పుడో
యిప్పుడో
మచ్చుకో దుర్ఘటన
వెలుగు చూస్తే చాలు
కొండను తవ్వే పనిలో
తలమునకలైపోతారు
రక్షకభటులు
దొరికింది  ఎలుకయితేనే
ఎన్ కౌంటర్
దొరికింది సింహమే అయితే
సింహద్వారం తెరిచేది
నాలుగో సింహమే

ప్రభుత్వమా....!
ఈపైకపు మైకం పాడుయోచన
ఎంతటి ఘోర నేరాలకు నెలవో
సోయిదెచ్చుకొని సోచాయించు

నైతికాభివృద్దే నిజమైన అభివృద్ధి
నైతికత కోల్పోతున్నoదుకే
మనిషితత్వం భగ్నమై
మానభంగాలుగా భగ్గుమంటున్నాయి
యివి సామూహిక అత్యాచారాలు కాదు
ముమ్మాటికీ.....!
సామాజిక అత్యాచారాలే.
_______________________
✍️ జినుకల వెంకటేష్
 9652092120
____________________

0/Post a Comment/Comments