నే మరువలేని మహా మనిషి! బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

నే మరువలేని మహా మనిషి! బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి . నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం . సెల్ నెంబర్.9491387977.

నే మరువలేని మహా మనిషి!
----------@@@@---------------
అది 1985వ సంవత్సరం. పూర్వపు జిల్లా (నాగర్ కర్నూల్ ప్రస్తుత జిల్లా) మహబూబ్నగర్, కల్వకుర్తి తాలూకాలోని రాచాల పల్లి గ్రామంలో యుపిఎస్ పాఠశాల హెచ్ఎం గా నే పని చేస్తుండేవాడిని.
        రోజూ వెళ్ళే రీతిగానే ఆరోజు (రేపు 15 ఆగస్టు అనగా) నా స్కూటర్ పై స్కూల్కు బయలుదేరా. ఊరి బయటికి రాగానే స్కూటర్ రాయించింది. చేసేదిలేక, రోడ్డుపై వస్తున్న ఓ ప్రైవేట్ లారీ ఎక్కేసా. లారీ జోరుగా పోతుంది. అంతలోనే ఎదురుగా మరో లారీ వస్తుంది. ఇంతలోనే రెండు లారీల మధ్యలోకి హఠాత్తుగా ఎడ్ల బండి రావడం, ఆ బండిని తప్పించబోయి రెండు లారీలు ఢీకొట్టడం కనురెప్పపాటులో జరిగిపోయాయి.
           ఈ దృశ్యమంతా స్థానిక కల్వకుర్తి ఆసుపత్రిలో నే కోలుకున్న తర్వాత నాకు జ్ఞప్తికి వచ్చింది. ఎవరో ఓ అపరిచిత వ్యక్తి నన్ను ఆస్పత్రికి చేర్చాడని, ఆ వ్యక్తి పేరు భగవంత రావు అని, అతని ఊరు మాడుగుల అని నాకు మా అమ్మ గారు చెప్పారు.
            ఆ అపరిచిత వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుకోవడం నా బాధ్యతగా భావించి నేను వారి ఊరికి వెళ్ళాను. ఊరిలోని వారింటికి వెళ్లి వాకబు చేయగా వారు కాశీ వెళ్ళినట్లు తేలింది.
        చేసేదిలేక తిరిగి ఇంటికి వచ్చేసా. ఇది జరిగిన పదిహేను రోజుల తర్వాత వారు వచ్చారోలేదో తెలుసుకునేందుకు ఫోన్ చేయగా, ఆ ఊరి వారు చెప్పిన సమాధానం విని ఖిన్నుడనైనాను. కాశీ వెళ్లిన ఆయన యాక్సిడెంట్ కు గురై మరణించారని. ఇది వార్త.
       అయ్యో దేవుడా! ఆ  అపరిచిత వ్యక్తికి కృతజ్ఞతలు తెలుప లేకుండా చేసావే అనుకొని , నా మనసులో నేనే బాధపడుతూ ఇంటికి తిరిగి వచ్చేశా. ఇప్పటికీ ఆ అపరిచిత వ్యక్తి ని నేను మర్చిపోలేక పోతున్న. నా మదిలో ఆ అపరిచిత వ్యక్తి చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఏ లోకాన వున్న డో ఆ మహానుభావుడికి నా వందనాలు అభివందనాలు. ఈ నాలుగు వాక్యాలు అతనికే అంకితమిస్తూ, నా అశ్రునయనాలతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ నెంబర్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments