కానవా ఓ మానవా!(కవిత). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్ .9491387977.

కానవా ఓ మానవా!(కవిత). బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి . కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్ .9491387977.

కనవా ఓ మానవా.......!
      ---------------------------------
మానవా ఓ మానవా
హింస చేయుట మానవా
పెద్దల మాటలు వినవా
సద్గతి దారిని కనవా.     !

జీవులన్నీ సమానమని
యధార్థాన్ని తెలుసుకొని
మనముంటే బాగనుకొని
ఇంకా ఉందాం సర్దుకొని!

తోటి ప్రాణుల ప్రేమించు
కనుకరంతో పోషించు
అవి సఖ్యతను ఆశించు
దేవుడు నిన్ను కరుణించు !

అసత్యమును ఆడవద్దు
సత్యము పలుకుటే ముద్దు
తెలుసుకో నీవీ పొద్దు
తెలియకుండా ఉండొద్దు !

ఎవరికి చేయకు ద్రోహం
వదులుకో ఇక నీ అహం
వద్దే వద్దు ఆగ్రహం
నిలుపుకో నీనిగ్రహం !

ద్వేషాన్ని పెంచుకోకు
స్నేహాన్ని తెంచుకోకు
ఇక వంచన చేయబోకు
చేసి చెప్పకు ఏసాకు. !

ఇక కులం తలం ఎంచకు
మరి ఎవరికి తలవంచకు
పరుల సొమ్ము ఆశించకు
సజ్జన స్నేహం తెంచకు.  !

అశాంతి చింతను వదలు
ప్రశాంతి వాంఛ మెదలు
శాంతి స్థాపనకు కదులు
వదిలి పోవు ఇక చెదలు !

అడ్డదారిలో నడవకు
బిడ్డ చేయనిక విడవకు
కాలం వృధా చేయకు
అపనింద నువు మోయకు !

ధన దాహం వదులుకో
దురాశనూ మానుకో
యువరాజూ కోలుకో
రాజ్యమును ఏలుకో  !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ .9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments