గోవుల గోపన్నలం (బాల గీతం)
-------------&&&&&------------------
గోవులు కాయు పిల్లలం
బావులు చేయు మల్లెలం
దినాం కుడుతాం కుల్లలం
ఇనాం పొందిన మొల్లలం !
గోవులకు పెడతాం దాన
వినిపిస్తాం గాన బజాన
అవి ఇస్తాయి పాలు చాన
అమ్ముతాం బజారులోన,!
డబ్బులు వచ్చును చేతికి
ఇస్తాంలే మా శ్రీమతికి
తను గోవుపాలను పితికి
కాయుటకిచ్చే గోమతికి !
గోమతి వెంటనే కాచి
మాకై తను వేచి చూచి
ఇచ్చే కప్పు చేయి సాచి
ఆమె సదా అమ్మ కూచి !
అమ్మ కూచి బుద్ధిశాలి
కలలలోన తాను తేలి
పెడుతుందిక చక్కిలిగిలి
మంచం పై తాను వాలి !
నవ్వుతారు ఇక అంతా
వారనుకున్నారు కొంతా
అది అసలు కాదు కాంతా వదులుకో అమ్మీ చింతా !
తను చెప్పినట్లు విన్నది
సరే అని ఒప్పుకున్నది
మా వింత కథను విన్నది
చివరికి ఓకే అన్నది !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.:9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.