ప్రబోధం (కవిత). సహస్ర ముత్యాల హారాల అవార్డు గ్రహీత బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

ప్రబోధం (కవిత). సహస్ర ముత్యాల హారాల అవార్డు గ్రహీత బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

ప్రబోధం (కవిత)
        -----------------------
రండి రండి రండి మా మాటను వినుకోండి
మా భరతమాత ప్రియమైన మిత్రులారా
లెండి లెండి లెండి మీరు కూడా వినరండి
ఓ భారతీయ మా మంచి మిత్రులారా !

వ్యాపారం ముసుగేసుక ఆంగ్లేయులు
దోచుకునేటందుకు మన దేశం వచ్చిరి
అధికారం మాదని అహంకారంతో సెలవిచ్చిరి!

వారు మన భారతీయులను అష్ట కష్టాలు బెట్టిరి
కారాగారంలో పెట్టి హింసించ బట్టిరి
మన జాతిపిత మహాత్మా గాంధీజీ గమనించే
స్వాతంత్ర పోరాటం తాను వేగ జరిపించే !

స్వాతంత్రం సాధించి మనకు అందించుటకు
అహరహం సమరం సాగించను బాపూజీ
తట్టుకోలేక పలాయనమైన ఆంగ్ల ప్రభుతకు
మెట్టు దిగి వచ్చేలా కలిగించనుగా ఇబ్బందిజీ!

అహింసా ఆయుధాన్ని చేతబట్టి
ఆంగ్లేయులను తాను వెళ్ళగొట్టి
హింస లేని విల్లును తాసంధించే
స్వాతంత్రాన్ని మనకు అందించే !

సత్యమనే ఆయుధాన్ని పట్టమని చెప్పె
అసత్య దైత్య శక్తుల గుట్టుతాను విప్పె
ఉవ్వెత్తున తల ఎత్తుక నడవమన్నడు
దేశం కోసం ప్రాణమైన విడవమన్నడు!


సత్య దీక్ష వ్రతాన్ని తాను చేయించే
నిత్య గ్రహశోధన మార్గాన్ని చూపించే
మన ఆశయాల తీరం చేరాలని చెప్పె
సంశయాల పరంపర గుట్టుతాను విప్పె !

అహింస ఆయుధాన్ని తాను చేతబట్టె
మన దేశం నుండి ఆంగ్లేయులను వెళ్లగొట్టే
తత్ఫలితంగా సిద్దించేను స్వాతంత్రం
ఫలించెనుగా మహాత్ముని గణతంత్రం !

బాపూజీ బాటలోనే మనం నడవాలండి
దేశం కోసం మన ప్రాణమైన విడవాలండి
ఇది మనం పుట్టి పెరిగిన భారతదేశం
అందిద్దాం మనందరం ఓ శుభ సందేశం !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments