మిత్ర సాయం! బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్.9491387977.

మిత్ర సాయం! బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్.9491387977.

మిత్ర సాయం (ముత్యాల హారం ప్రక్రియ గేయం)
-----------------₹₹₹₹₹₹₹-------------
ఓ మా మంచి మిత్రమా
గమనించే నేత్రమా
శృతి అయిన గాత్రమా
పాడేందుకు ఆత్రమా  !

నీ గానం అతి మధురం
అందుంది అమిత సారం
ఇది దేవుడిచ్చిన వరం
అయ్యేను కల సాకారం !

ఇంటిపట్టున ఉండవు
మా దృష్టికి అందవు
నీవు అపార సింధువు
అయినావు మా బంధువు!

ఏ గానం చేస్తున్న
అందు అమృతమే మిన్న
అని అనుకుంటున్నారన్న
అదృష్టవంతుడివన్న !

మాకేది ఆ అదృష్టం
మా జాతకంలో కష్టం
ఉందనేదే సుస్పష్టం 
అందుకే మాకీ నష్టం !

పాడాలని ఆశ నాకు
ఎలా చెప్పాలి ఇక మీకు
దారి చూపు నీవు నాకు 
చెప్పవద్దు నీవు సాకు. !

చెప్పు మిత్రమా జవాబు
నీపై చేయను రుబాబు
ఏడుంది పాటల గ్లోబు
పాడి అవుతాను నవాబు !

చేయి ఈ ఒక్క సాయం
పాడి సాధిస్తా విజయం
వేదిక నాకు అపజయం
ఇది నే ఇచ్చిన అభయం !

నీవు నా మాటను నమ్ము
నమ్మి నన్ను చేరుకొమ్ము
పాడి దులుపుతాను దుమ్ము
దానితో కూడును సొమ్ము. !

తెలుసుకోరా నా ప్లాను
వచ్చిన ఆ సొమ్ముతోను
నే చేపిస్తా ఓ చైను
నీ మెడలోన వేస్తాను !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.: 9491387977
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments