చిత్ర కవిత (కన్నీళ్లు కార్చిన అక్షారాలు)
కామారెడ్డి జిల్లా కేంద్రంలో డ్రైవర్స్ కాలనిలో
ఈ రోజు12..7..22 నాడు జరిగిన యదార్థ ఘటన
నా అక్షారం కన్నీళ్లు కారుస్తుంది
రేకుల షెడ్డులో పేద కుటుంబం
ఆడుకుంటున్న పిల్లలు
ఒక్కరికొక్కరు విద్యుత్ షాక్
తో మరణం కాపాడే బాధ్యతలో
తల్లి తండ్రి కరెంట్ కు ఏమి
తెలుసు మమకారం
వర్షానికి ఏమి తెలుసు
కళ్ళముందే కుటుంబం
మొత్తం స్మశానం వైపు కు
అడుగులు
అక్షరాలకు ఆర్జించే శక్తి ఉంటే
వారిని బతుకించమని
శవపంచనమాలు
రాజకీయ పరామర్శలు
శరమాములే
నిపుణులు తో చేయించుకోండి
సొంత వైద్యం మానండి
విద్యుత్ నిరోధకాలు
ఉపయోగించండి
సెల్ఫీ లు. వాగులు చుట్టూ
ప్రాజెక్టులు,జలపాతాలు వద్ద
జాగ్రత్త
ఒక్కరు ఏమిటి
రైతుల నుండి ప్రతి వ్యక్తి
బాధ్యతలు అవసరమే
బతికుంటే బాలుస కూర
తినవచ్చు
చిన్నపొరపాటు ప్రాణ0తకం
......అవుతుంది
నా అక్షరం కుంటిదై
కన్నీళ్ల దిగమింగి
మరో కుటుంబం
బలి కావద్దు
వర్షాలు ప్రమోద0
. కావాలి కానీ ప్రమాదాలు
తెచ్చుకోవద్దు
నాకు నేను సమాధానం
బాధ్యతలు... జాగ్రత్తలు
అవసరమే మరి
ఉమశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి
Show quoted text