శీర్షిక: జీవితం
జీవనగమనంలో
ఎదుగుతున్న ప్రతి దశలో
ఎన్ని మలుపులో
ప్రతిమలుపు
ఓ సరికొత్త అనుభవాన్ని
ఆభరణంగా అందిస్తుంది
అనుభవపాఠంలోంచి
సరికొత్త దారిలో పయనిస్తుంది
ఎందరెందరో పరిచయమౌతూ
సాగుతున్న దారుల్లో
మార్గంచూపే గురువులౌతారు
పంచభూతాలు మనల్ని
గమనిస్తునే ఎదుగుదలకు
ఎదురయ్యే ఎత్తుపల్లాలకు
ఎదురిగే ధీటైన ధైర్యాన్ని నింపుతుంటాయ్
సృష్టిలో సమస్తం
మనకోసమే
ఉన్నంతకాలం ప్రకృతిని కాపాడే కాపలాదారులం
మనలో దాగిన
అనంతశక్తి సామార్థ్యాలను
బయటకుతీసి
మనకంటూ ఓ జీవితాన్ని
నిర్మించుకోవాలి
మనమంటే గెలుపు ఓటముల
సంగమమేనని సాగిపోవాలి
బాద్యతలను నెత్తినెట్టుకుని
తట్టుకుని ముందడుగేయల్సిందే
సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.
హామీపత్రం:
------------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు.