నం(ణం) అక్షర పదాలు
-------------------------------------
వెన్నెలమ్మ చల్లదనం
వెన్న ముద్ద మెత్తదనం
సన్నజాజి చక్కదనం
మిన్న కదా ప్రేమగుణం
కన్నవారి గొప్పదనం
ఎన్నతరమా! త్యాగగుణం
ఉన్న ఊరును దినదినం
ఉన్నతంగా తలప ఘనం
చిన్నారుల మంచితనం
పన్నీరులా శ్రేష్టగుణం
ఎన్ని ఉన్న ఇలను మనం
మన్నించుట కరుణవనం
సున్న కదా పిరికితనం
పున్నమియే నగవు వదనం
జున్నులోని తీయదనం
విన్నావది మూలధనం
-గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు,
ఎమ్మిగనూరు,
సెల్:9966414580.