" రైతు గోస"-గద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు.

" రైతు గోస"-గద్వాల సోమన్న , గణితోపాధ్యాయుడు,ఎమ్మిగనూరు.

" రైతు గోస"
-------------------------------------  
అన్నదాతల బ్రతుకు
ఘోరమాయెను తుదకు
వారి క్షేమము వెదకు
ఓ వెన్నెలమ్మ

రైతు రాజే నాడు
మారిపోయెను నేడు
వారి దుస్థితి చూడు
ఓ వెన్నెలమ్మ

పెరిగిపోయెను అప్పు
రైతు బ్రతుకున నిప్పు
దాపురించెను ముప్పు
ఓ వెన్నెలమ్మ

రైతు ఉంటే మెతుకు
చల్లగుండును బ్రతుకు
లేక పిండిన చెరుకు
ఓ వెన్నెలమ్మ

-గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు,
ఎమ్మిగనూరు,
సెల్:9966414580

0/Post a Comment/Comments