ఎన్ని జన్మలు ఎత్తిన
పుట్టింది మామిడల వారింట
ఎనిమిది ఏళ్ల ప్రాయంలోనే
భవనిపెట్ నందికంటి వారింట
రామచంద్రుని సతిగా
ఎనిమిది ఏళ్ల వయస్సులోనే
ఓర్పు తో లేదా కూర్పుగా
నలుగురు ఆడపిల్లలు
నలుగురు కొడుకుల కు
జన్మ నోసాగి
సౌభాగ్యవతి గా సంసారం నౌక లో ఎన్నో కష్టాలు
స్థితి లేదు కానీ దానం లో
దాతృత్వం లో వెనుకడుగే లేదు
ఆమె ఒక అన్నపూర్ణ
భవనిపెట్ ఇంట ఎవరి
ఇంట అడిగిన తెలుసు
అతిథి దేవో భావ అనే భావన
ఆమె చేతులు అక్షర సత్యాలు
తను తినకున్న ఇతరుల కడుపు చూసే హృది
సత్సాంగి
మట్టి చేతులు తో పని చేసి
ఉమ్మడి కుటుంబం భారం మోసి
సంప్రదాయాలు పూజలు ఎన్నో మరెన్నో మరో తరానికి అందించి0ది
అటుకొడుకులు మరో పక్క
కోడళ్ల
కొడళ్లను కూడా కుతుర్లుగా
సేవలు ఎన్నో చేసి
సముద్రం అంత సారం దాగి
తుపాన్ లాంటి ఒత్తిడులు
ఎన్నో పూడిమిల ఓర్పుతో భరించి
నా కోసం కాక
తన వారికోసం కాక
అందరికోసం తపన పడ్డ
ఖర్మ జీవి
కొందరు ఎతికితే తప్పులు
దొరుకోనో ఏమో
కాని ప్రేమ ఆపేక్ష
అనురాగం కలబోత
బాధను కూడా సర్దుకపోయి
ప్రేమ హెచ్చు తగ్గులు లేవు
అత్త అమ్మ ఆమె అందరికి అమ్మే
పేరులోనే లక్షిమి ఒక గృహాలక్షమి నర్సుబాయి
సేవల్లో నర్సు బాయి
ముని మనుమలు, మనుమరా ల్లు జగమంత కుటుంబం
నిర్మించుకున్న అమెబ్21..7..2022 గురువారం
మరణించిన అవిభాజ్యమైన
ప్రేమ జ్ఞాపకాలుగా చిగురిస్తూనే
ఉంటాయి
మా అందరి అశ్రునయనాల నుండి వచ్చే జలాధార లో
దాగి ఉన్న రూపం
ఎందరికో అన్నము పెట్టి
తను పస్తులున్న ధనం లో
వెనుకడుగు వేయని
గోదానం,భూదానం
ఎడ్లు పోయిన,వస్తువులు
పోయిన కచ్చితంగా చెప్పేటత్వం
జిష్టి మంత్రం,పాము మంత్రం
తెలు.మంత్రం,పట్టు మంత్రం
ఎరుపు మంత్రం తో పాటు
జ్యోతిష్యం లో కూడా దిట్టగా
ఆయుర్వేద చిట్కాలతో సమీపగ్రామలకు సుపరిచితం
తన మెడలోని గుండ్లు మనుమలు మనవరాళ్లు
కు పెట్టి
వస్త్రాలు కూడా దానం చేసి
ఎన్ని ఓడదోడుకులు ఉన్న
కొడుకులు కొడళ్లను తిట్టని
ప్రేమ
చెల్లెలు కుటుంబాన్ని
తల్లివారి కుటుంబాన్ని
అదుకొని
తన వాత్సల్యం పంచిన
అనురాగ మూర్తి
ఆమె ఆహార్యం ఒక లక్షిమి
రూపం మర్చిపోని తత్వం
చేతల్లో మాటల్లో కూడా
హాని చేయని ఒక ఆదర్శనికి
నిలువెత్తు రూపం
ఆమెను ప్రేమించని బంధువు
లేదు విసిగించుకున్న వ్యక్తులు
లేరు
మళ్ళీ మళ్ళీ జన్మ లేని
జన్మరాహిత్యం ఆమెది
కర్మను అనుసరించుటలో
వ్యదలు ఎన్ని ఎదురు అయిన
ఎదుర్కొన్న జీవి
మనుమలు మనుమరాండ్రలు
వారి పిల్లలకు సైతం
సేవలు అందించిన తరుణి
నా అక్షారాలు గుండెను పిండి
చేసి ఎడిపిస్తున్నాయి
పుట్టినవాడు గిట్టక తప్పదు
అనే భగవద్గీత వాక్యం తప్పదు
ప్రేమ లో అమ్మ
కరుణ లో అమ్మ
అమ్మ రూపానికి దైవత్వం
వస్తే ఆమె లక్షిమి నర్సుబాయి
నంది కంటి
మా భౌతిక దేహాలు ఉన్నంత
వరకు నీ తో సాన్నిహిత్యం
మరువని చెదురని జ్ఞాపాకాలుగా చిగురిస్తూనే
ఉంటాయి
ఉమశేషారావు వైద్య