*సాహితీ చంద్రుడు-సినారె*(కైతికాలు)రమేశ్ గోస్కుల

*సాహితీ చంద్రుడు-సినారె*(కైతికాలు)రమేశ్ గోస్కుల

సాలుకొక్కటి తప్పక
పొత్తంను వెలయించి
సాహితీ క్షేత్రాన్ని
ఇడవక వెలిగించి
అతనే కదా! నిత్య
సాహితీ చంద్రుడు

ప్రక్రియ లెన్నియో
అలవోకగా రాసి
కవనాన ఎన్నియలు
పూయింపగా  జేసి
ఔనౌను  అతనే
నిత్య సృజన శాలి

అభ్యుదయ భావాల
కావ్య సేద్యం పంచె
'మంటలు- మానవుడు'
మహిన వెలిగించె
ప్రతిభ తోడ తాను
పరిమళాలు పంచె

అక్షరాలెందరికో
ఆరాధ్యమై నిలవంగ
ముఖా ముఖి యను నట్టి
గ్రంధ రాజం వెలయంగ
జగతి యందు
జీవమిచ్చి భాషకున్

జలపాతమను పేర
జగతి నూగించెను
'విశ్వగీతం' రాసి
విహంగం చేసెను
కవనంబు వెలుగుతో
కదన చిగురాకు వెలిగించె

జ్వలిత చేతనంబై
చలన మేరువు లై
తేజస్సు తపస్సంటు
పలికే నినాదాలై
కొత్త ప్రవచనాలు
చిగురుటాకులా ఎదిగించి

పంచకట్టు తోడ
తెలుగు దనం పెంచి
పాటల పరిమళం
దిగంతాలకు పంచి
తను జనిన వాయువై
మన చుట్టు భ్రమరించే భావమై

నిప్పుల్లో కడగమని
నినాదాల్లా రాసి
తప్పుడోల్ల తాట
తీయమంటు పలికేసి
తెలుగు భాషన రా--సినారే
వెలుగు పూలు పూయించ సినారె

   (సినారె జన్మదినం సందర్భంగా)

రమేశ్ గోస్కుల
హుజురాబాద్.

0/Post a Comment/Comments