ప్రథమ పీఠంపై ద్రౌపది ముర్ము గారు-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

ప్రథమ పీఠంపై ద్రౌపది ముర్ము గారు-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

ప్రథమ పీఠంపై ద్రౌపది ముర్ము గారు
------------------------------------- 
ప్రథమ పీఠంపై
వెలసెను గిరి పుత్రిక
భారతి మోముపై
విరిసెను నగు మల్లిక

మన దేశ చరిత్రలో
అరుదైన ఘట్టమిది
ప్రజాస్వామ్యానికి
నిలువెత్తు సాక్ష్యమిది

ఆదివాసుల వనమున
వికసించిన కమలం
"ద్రౌపది ముర్ము "గారి
జీవితమే విమలం

మన సంస్కృతి గొప్పది
స్త్రీలకు గౌరవమిది
ఘన చరిత్ర మనది
ప్రబల నిదర్శనమిది

-గద్వాల సోమన్న ,
గణితోపాధ్యాయుడు,
ఎమ్మిగనూరు,
సెల్:9966414580.

0/Post a Comment/Comments