అమృత తుల్యం

అమృత తుల్యం

నేటి 11 రోజులు
చుక్కపూర్ 
లో నారాయణ రావు
రుక్మమ్మ ల తనయ గా
ఆదరణ పొంది
రామచంద్రుని సతిగా సుతి
తప్పని నీ గమనం
నీవు కూడా ఒక మదర్ తెరిస్సా వి
అత్త రంగమ్మ కుష్టు వ్యాధి
అయిన ఆ రోజుల్లోనే
వైద్యం లేని సేవల్లో
సేవా తరణిగా అస్యహించుకొని అమ్మతనం
అస్వస్థ అయ్యే వరకు  ఏదో
పనిచేసి న ఖర్మ జీవివి
కొడళ్లకు సేవలు అందించి
అల్లుళ్ళను కొడుకులుగా చూసి
మేనల్లుళ్ళను 
తొడబుట్టిన వారిని
ఒకే కోణం లో హృదయం
పంచిన మాతృమూర్తివి
పుణ్య నది లో కూడా 
గంగా నది  లో కూడా కొంత
చెత్త సహజం
వెతికి వెతికి కొందరు తప్పులు
తీయవచ్చు
ఆకులు రాలు ట సాహజం
చిగురించుట అతిసాహజం
మేము స్మృతి వనం నిర్మించే
అసక్తులం
కానీ గుండెల నిండా 
నిక్షిప్తమైన అవిభాజ్యమైన
నీ ప్రేమ మందిరంలో
పెరిగిన వారికి
పెరుగును చితికితే
మజ్జిగ అవుతుంది
మజ్జిగ ను చితికితే
వెన్న అవుతుంది
వెన్న నుంచి వచ్చే నెయ్యి
లాంటి దానివి నివ్వు
  నందికంటి వారింట
   వికసించిన లక్షిమి
ఆర్థికంగా కష్టాలు ఉన్న
ఒక్కరోజు అన్నం పెట్టడం
అపలే
ఈ రోజుల్లో ఒక్కరూ ఎక్కువైన
విస్సుకునే జనాలు
ఉంటే 4 గురితో ఇల్లు
కలకలడాలని వాంఛనీయురాలువు నీవు
నీ ఛాయా చిత్రం
ఉట్టిపడే జీవ కళా
నేటి కి 11 రోజులు
కాలాన్ని నిందించాలా
మాకు మేము తెలుసుకునే
జ్ఞానం లేదు
సంపద అంటే ద్రవ్యం ద్రవ్యం
నీ దృష్టిలో నేను నా పిల్లలు
నా పరివారం 
అనే దిగ్విణీకృత మైన
అనురాగం తో నిండిన గుండె
ఎందరమే ఏదో సందర్భంలో
మాటలు అన్న కళ్లనుంచి
అశ్రుధారాలు తప్ప ఒక్కరోజు
ఎదురుపడి తిట్టలే
ఎవరి ఇంటికి పోయిన నిన్ను
విసుగించుకోలే
ఎన్నో అల్లికలు నేటి తరానికి
రాని పనులు కూడా
చేసి అబ్బుర్పర్చిన ఫ్రీజ్
కవర్లు,డోర్ కర్టెన్లు
బేషన్ లడ్డు చేస్తే
అట్టే తినాలి అనిపించే తత్వం
బిడ్డలు నలుగురు కాదు నలుగురు కొడళ్లను వాళ్ళ తల్లులకన్న ఎక్కువ చూశావు
నాలుగు రు అల్లుళ్ళను కూడా
కలుపుకొని 8 మంది కొడుకులుగా చూశావు
చెల్లెలు బిడ్డ అని తరతమ్యత లేని ప్రేమను పంచావు
చుక్కపూర్ తల్లిగారి ఇంట
అన్న పిల్లలు,ఇద్దరు తమ్ముళ్లు
వారి పిల్లలను  కూడా అవిభాజ్యమైన హృద్యప్రేమతో
చూసిన కరుణ నీది
అమ్మగారింటి కి పోతే బస్ దిగి న మొదలు ఇంటికి చేరే వరకు
నిన్ను పలుకరించినా జనం
ఒక్క అభిమానం చాలు
నీవెంత  సాహృది వో
జగమంత కుటుంబం
నిర్మించుకున్న నీవు
ఆకాశం లో ఒక తారగా
మబ్బులు ఎక్కిన ఆకాశంలో
చుక్కల్లా మాయం అయ్యావు
పున్నమి వెన్నెల్లా నీ జ్ఞానపాకాలు ఒక చరితం
హైద్రాబాద్ లో ఉన్న బైరయ్య
కొండ రాములు చేసే జ్ఞానపాకం
చాలు
చుక్కపూర్ రాజమ్మ ను
లక్షిమి, జయ ను అమ్మలా
చూసిన ఔదార్యం నీది
నా అక్షారాల కు శక్తి లేదు
నీవు అత్తమ్మ అయిన
అమ్మ వే నీవు
ఓదార్పులో చిరునామా నీవు
రేపు 12 వ రోజు కాలం ఆగదు
నీ జ్ఞాపకాలకు మరణం లేదు
అమరత్వానికి జోహార్ జోహార్
సాష్టాంగా ప్రాణమములు అర్పిస్తూ
నీ సమస్త పరివారం

0/Post a Comment/Comments