ప్రపంచ జనాభా దినోత్సవం* శ్రీలతరమేశ్ గోస్కుల

ప్రపంచ జనాభా దినోత్సవం* శ్రీలతరమేశ్ గోస్కుల

నింగిన మెరియు చుక్కలోలే..
నిండు పున్నమి వెలుతురోలే..
నేలనంతా పరుసుకుపోతుంది...

ఆకాశం నుంచి జాలువారుతున్న చినుకులకన్నా వానాకాలం అదును కానీ..
ఏ కాలంతో పని లేకుండా అడ్డూ అదుపూ లేక పుట్టుకొచ్చిన పుట్టగొడుగులతో
అరకొర జీవితాలాయే..
అందనట్టి అవకాశాలాయే..

*నాడు...*
గంపెడు పిల్లలున్నా
*నేడు..*
ఒక్కరిద్దరున్న సంతానమైనా..
రొట్టెకడుక్కుని కడుపు నింపుకునే బతుకులే ఎక్కువుండే...

అప్పుడెప్పుడో పెరిగిన జననరేట్లు
తగ్గిన మరణరేట్లతో..
ఆరోగ్యవంతుల జాబితా అమాంతం పెరిగి
నిండుకుండలా మారింది భూగోళమంత..
అక్కడక్కడ పలుచగున్నా కానీ..
గడ్డిపోచల్లా..
గరక పోచల్లా..
రోజురోజుకు పుట్టుకొచ్చే జనం దేవుడిచ్చిన వరమేననిరి..

ఉన్నోడికేమో తిన్నదరగని
లేనేడికేమో తిండి దొరకని చందంగా ఉన్నను..
గింజ దొరకని పరిస్థితిలో నకనకలాడుతున్న దేశాలెన్నో
మనుగడకై పాకులాడుతూనే..
ప్రపంచమంతా ఒకే తాటికిందకి వచ్చినా
విశ్వ విపణిలో...
ఆకాశానంటిన ధరలకొండను అందుకోలేక విలవిలలాడుతుంటే..
చతికిలపడిన ఆర్థికం వెక్కిరిస్తోంది మరొక వైపు..

కొరతలన్నీ కొరివి దయ్యాలై
నిత్యావసరాలు సైతం సామాన్యుడిని
కాటేయ్యవట్టే పదితలల పామై..

*శ్రీలతరమేశ్ గోస్కుల*
*హుజురాబాద్.*

0/Post a Comment/Comments