గడియారం--గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

గడియారం--గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

గడియారం
---------------------------------- 
కాలాన్ని తెలుపుతుంది
క్రమశిక్షణ నేర్పుతుంది
దాని పేరు గడియారం
దానికుంది వయ్యారం

టిక్ టిక్ టిక్ అంటుంది
గోడపైన ఉంటుంది
మణికట్టుతో జతకట్టి
అందాన్ని పెంచుతుంది

కాలం విలువ చెపుతుంది
కర్తవ్యం బోధిస్తుంది
సమయం,మాట మీరిన
భవిత శూన్యమంటుంది

అందమైన గడియారం
అదెంతో అలంకారం
అందించును  ఉపకారం
అలుపు లేని పోరాటం

--గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు,
సెల్:9966414580. 

0/Post a Comment/Comments