శీర్షక:నవ మనువాదం పేరు: సి.శేఖర్(సియస్సార్)

శీర్షక:నవ మనువాదం పేరు: సి.శేఖర్(సియస్సార్)

శీర్షిక: నవ మనువాదం

కమనీయమైన 
కల్లోలాలే రేగుతున్నయ్ నేడెక్కడైన
పైకెంత గంభీరాన్ని మద్రించుకున్నా
లోలోపలి అరాచకత్వం బయటపడుతునేవుంటుంది
పైరగాలిలా మనసునెంత ఉల్లాసపరిచినా
సుడిగాలిలా విసిరికొట్టెందుకేననే
వికృతత్వం
విశృంఖలత్వం ఒకటిగా
పుడమిపై పురుడుపోసుంటుంటాయ్
ఏంతెలియనోళ్ళ ఉసురు తీస్తుంటాయ్
పున్నమిచంద్రులై వెలుగు విరజిమ్ముతూనేవుంటూ
అంతలోనే ఆమావాస్యచీకట్లోకి జారుకొంటారు
మాటలతో కోటలిక్కడ మహాద్భుతంగా నిర్మిస్తరు
నీటిమీద రాసినవవి మరి
క్షణంలో నట్టేట ముంచుడే నైజం
ఐక్యతరాగమిక్కడ కొందరాలపిస్తరు
మూడురంగలజెండాను చీల్చేందుకే కట్రలెన్నోజేస్తరు
సమానంగా కలిసి ఊగే రంగులు
లౌకిక రాజ్యానికది ప్రతిపాదిక
దుష్టశక్తులిక్కడ రంగుల్లో పెత్తనంకోసం మనుషులపైదాడి
నాటి మహనీయుల ఆశయాల్ని మరుస్తున్నరు
రాజకీయాల్నైతే
భ్రష్టుపట్టిస్తున్నరు
కూల్చడమే ధ్యేయం
అడ్డదారుల్లో అధికారదాహం తీర్చుకొని
అల్లకల్లోల రాజకీయంజేసి
అలజడి సృష్టిస్తన్నరు
మతాలనడ్డువెట్టుకొని
మనుషుల్ని చీల్చే 
నవ మనువాదుదలిపుడు
నరమేధం సృష్టిస్తున్నరు
అణచివేతలు 
సంకెళ్లు
దిక్కారగళంతో హక్కులననిచివేస్తూ
సమానత్వాన్ని కాలరాస్తున్న
అసమానతల రాజ్యమిది
మాటల్లో మంత్రాలు
చేతల్లో కుతంత్రాలు
బలిపశువులు బహుజనులే
కళ్ళుతె‌ర్సాలే 
కూకుంటె అయితదాంటా
పసిగట్టి  బుసగొట్టాలీ
సమానత్వాన్ని సాధించాలి
సాటిమనుషులందరికి పంచాలి

సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు, 
9010480557....

హామీపత్రం:
-----------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు.

0/Post a Comment/Comments