భక్తి, నృత్య సంగీత స్వరార్చన

భక్తి, నృత్య సంగీత స్వరార్చన

3.7.22
  శ్రీ లక్ష్మీనరసింహస్వామి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ మరియు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆల్ ఆర్ట్స్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన భక్తి ,నృత్య మరియు గీతాల స్వరార్చన కార్యక్రమానికి అచ్చంపేట ప్రాంతానికి చెందిన తెలుగు ఉపాధ్యాయురాలు, రచయిత్రి మరియు కవయిత్రి డాక్టర్. పోల(కొండూరు) సాయి జ్యోతి ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు.
    సభాధ్యక్షురాలుగా అపర్ణ దీపిక, కార్యనిర్వహణాధికారిగా నరహరి మణికంఠ వ్యవహరించారు.
  కార్యక్రమం అధ్యంతం కళాకారులు, చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు సబికులను ఆకట్టుకున్నాయని సాయి జ్యోతి తెలిపారు ఈ సందర్భంగా ప్రముఖ అతిధి లక్ష్మీ శేషాచార్యులు (మ్యూజిక్ డిపార్ట్మెంట్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం) గౌరవ అతిథిగా గుదిబండ వెంకట్ రెడ్డి (జివిఆర్ కల్చరల్ ఫౌండేషన్ చైర్మన్), ఆత్మీయ అతిథిగా డాక్టర్. పోల (కొండూరు). సాయి జ్యోతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని శాలువా, మెమెంటుతో సత్కరించారు.
  ఈ కార్యక్రమంలో నాగరాజు, వెంకటేశ్వర్లు, డా. విహారి శశాంక్, వెంకటేశ్వర్లు, భాగ్యలక్ష్మీ దేవి, శంకరయ్య పాల్గొన్నారు.
   ఆత్మీయ అతిథిగా వ్యవహరించిన సాయి జ్యోతిని శాలువా, మెమెంటుతో ఘనంగా సత్కరించారు.

0/Post a Comment/Comments