బోనాల పండుగ ఎందుకు జరుపుతారు

బోనాల పండుగ ఎందుకు జరుపుతారు

బోనాలు ఎందుకు జరుపుకుంటారు
కామారెడ్డి జిల్లా దోమకొండ
జులై 16,ప్రజాజ్యోతి
ఉమశేషారావు వైద్య,లెక్చరర్&కవి
 బోనం అంటే దేవికి నైవేద్యం అని అర్థం.మట్టి కుండ ను తలపై పెట్టుకొని,వేపాకులు ధరించి ప్రత్యేక వాయిద్యాల తో మంటి కుండ మీద ప్రత్యేక దీపం ఉంచి బోనాలు తీస్తారు
స్త్రీలు పట్టువస్త్రాలు లేదా ఎరుపు లేదా పసుపు రంగు చీరలు ధరిస్తారు
  తెలంగాణ గ్రామాల్లో ఉరడమ్మ పండుగ లేదా ఊరు పండుగ కూడా అంటారు
   వర్షాలు కురువులని,ఊరును కాపాడాలని గ్రామదేవతలను శాంతి చేయడం ఒక పద్దతిగా తెలంగాణ లో ఆనవాయితీ ఉంది.దున్న పోతును బాలి ఇవ్వడం ఒక ఆచారం.ఉరుబయటవారిని ఆ రోజు గ్రామ0లోకి రానియ్యారు
    బోనాలు ఎత్తుకున్న స్త్రీలకు  అమ్మవారు అవహిస్తారు అనే నమ్మకం తో బోనాలు దించేముందు నీళ్లు పోసి దండలు పెడుతారు
   తెలంగాణలో గోల్కొండ ఎల్లమ్మ దగ్గర ప్రారంభం అయ్యి సికింద్రాబాద్. మహంకాళి బోనాలతో ముగుస్తుంది
    తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.రాజధాని కి చెందిన మంత్రి బోనం సమర్పిస్తారు
   బోనాలలో ఘటం  ఒక ప్రత్యేక త కలదు. ఏనుగు,గుర్రాల మధ్య అక్కన్న మదన్న బొమ్మల మధ్య పోతారాజులు మొత్తం పసుపు తో,పులిచారాల గల అలంకారం తో ప్రత్యేక నృత్యాలు చేస్తారు
   నైవేద్యం సమర్పణ చెయ్యడం మేకలు,గొర్లను పోతారాజులు గావు పట్టుతారు. పళ్లతో తలకాయదగ్గర పట్టి చిరుతారు
    రంగం ఒక ప్రత్యేక కార్యక్రమం శివసత్తులు ,జీవితంతం బ్రహ్మచారిని గా ఉండి అమ్మ వారి సేవలో గడిపే వారు భవిష్య వాణి వినిపిస్తారు. భక్తులకు  అత్యంత విశ్వాసిస్తారు
    ఆశాడ మాసం మొదటి ఆదివారం ప్రారంభం అయ్యి చివరి ఆదివారం ఉత్సవాలు ముగుస్తాయి. కులాల వారిగా,సంఘాల వారిగా బోనాలు తో పాటు ఊరు బయట వంటలు చేసుకొనే విధానం కూడా ఉంది
  వాన కాలంలో వచ్చే కలరా,విరేచనాలు, మలేరియా వంటి వ్యాధులు బోనాలలో ఉపయోగించే సున్నం,దీపం,పసుపు పదార్థాల అంటి వైరస్,అంతిసేఫ్టీక్ గా పనిచేసి వర్ష కాలం లో ప్రభాళించే రోగాలు బారిన పడకుండా తోడ్పడతాయి
వైజ్ఞానిక  ఆధ్యాత్మిక తో పాటు సంఘ జీవనం ముడి పడి ఉన్న బోనాలు తెలంగాణ ప్రత్యేకం
ఉమశేషారావు వైద్య
లింగాపూర్, కామారెడ్డి

0/Post a Comment/Comments