మానవుల నిత్య జీవిత విధానంలో దేవతలతో పాటు నవగ్రహ దేవతల అనుగ్రహం కూడా ఉంటేనే జీవనయానం ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది అనడంలో లేదు అలాంటి నవగ్రహముల ఆరాధన ఎందుకు చేయాలి వారి యొక్క ప్రభావం ఏమిటి అనేది తెలియజేస్తున్నాను
*నవగ్రహముల విశిష్టత*
*1.చంద్రుడు :*
అద్దం పుట్టడానికి చంద్రుడు కారణం. అందుకే అద్దములో దిగంబరముగా చూచుకొనుట, వెక్కిరించుట చేయకూడదు.
*2.గురువు :*
సర్వ శాస్త్రములు తెలిసిన గురువు బృహస్పతి, ఎవరైనా గురువుని కించపరచితే గురుదేవునికి అగ్రహము కలుగుతుంది. గురువులని పూజిస్తే బృహస్పతి అనుగ్రహం కలిగుతుంది.
*3.బుధుడు :*
బుధుడికి చెవిలో వ్రేలు పెట్టి తిప్పుకుంటే కోపము. అందునా బుధవారం అస్సలు చేయకూడదు. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసిన, జ్ఞానం ఉంది అని విర్రవీగిన కోపము.
*4.శని :*
శనికి పెద్దల్ని కించపరచిన, మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా కోపము. తల్లితండ్రిని చులకన చేసిన సహించడు.
సేవక వృత్తి చేసిన, సేవ చేసిన వారిని కాపాడతాడు.
*5.సూర్యుడు :*
పితృ దేవతలని దూషిస్తే రవికి కోపము. నమస్కార ప్రియుడు. తర్పణ గ్రహీత.
సూర్య దేవునికి ఎదురుగా మల మూత్ర విసర్జన దంతావధానం చేయకూడదట.
*6.శుక్రుడు :*
శుక్రుడికి భార్య/భర్త అగౌరవ పరచుకుంటే కోపము. ప్రేమకారకుడు. లక్ష్మీ దేవి కృప లేకపోతే శుక్ర కృప కష్టమే.
అమ్మకి శుచి శుభ్రత లేని ఇళ్లు మనుషులు నచ్చరు, గొడవలు లేని ఇల్లు ఇష్టము.
*7.కుజుడు :*
అప్పు ఎగ్గొడితే కుజుడికి కోపము.
వ్యవసాయ పరంగా మోసం చేస్తే ఊరుకోడు.
*8.కేతువు :*
జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకడిన, మోక్ష కారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపిస్తాడు.
ఈయన జాతకంలో బాగోలేకపోతే పిశాచపీడ కలుగుతుంది.
*9.రాహువు :*
రాహు వైద్య వృత్తి పేరుతో మోసగించినా, సర్పములని ఏమైనా చేసిన ఆయనకి కోపము కలుగును.
ఈయన భ్రమ మాయ కి కారణము..!!
సేకరణ ఇమ్మడి రాంబాబు
తొర్రూరు9 8 6 6 6 0 5 3 1
జిల్లా మహబూబాబాద్