అమ్మానాన్నల కథ (కవిత). సహస్ర ముత్యాల హారాల అవార్డు గ్రహీత బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

అమ్మానాన్నల కథ (కవిత). సహస్ర ముత్యాల హారాల అవార్డు గ్రహీత బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

అమ్మానాన్నల కథ (ముత్యాల హారాల ప్రక్రియ గేయం)
---------------&&&&&-----------------
గీత దాటని పిల్లలం
రాతమారిన మల్లెలం
ఇల వెలిగేటి వారలం
కలిమి కలిగిన పోరలం!

మంచి ముత్యాల హారాలు
కలిగిన చిన్న పిల్లలం
కంచి వస్త్రాలను తొడిగిన
మా మంచి మీ మల్లెలం.!

మాకు అమ్మా నాన్నలు
ఆరాధ్య దైవాలు
మేం వారిని పూజిస్తాం
ప్రతినిత్యం ధ్యానిస్తాం !

వారిక మా ఇష్టాలను
మేం పడేటి కష్టాలను
గమనించి తీరుస్తారు
మమ్ము ఓదారుస్తారు !

కోరుకున్నవి ఇస్తారు
మంచీ చెడు చూస్తారు
బడిబాట చూపిస్తారు
వెళ్ళుటకు ఒప్పిస్తారు !

చెప్పినట్లుగా వింటాం
నిత్యం బడికి పోతుంటాం
అక్షర సంపద కంటాం
మొదటి శ్రేణిలో ఉంటాం !

మాకు గురువంటే ప్రేమ
వారే మాకిక ధీమా
వినయం తోని ఒదుగుతాం
మా చదువులో ఎదుగుతాం !

ఆ బడిలో చదివినాక
మేమంతో ఎదిగినాక
తిరిగి ఊరి బడికి వస్తాం
గురువుగారిని పూజిస్తాం !

గురుభక్తిని చాటుకుంటు
వారే మా దేవుడంటు
ఇక మనసులో స్మరిస్తాం
మరి వారి పేరు జపిస్తాం !

అమ్మానాన్న గురువులు
కనిపించే దేవతలు
నిలుపుతాం వారి పేరు
ఇక కథ కంచికి చేరు !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments