ఓం నమశ్శివాయ
-------------------------
శివాయ శివాయ
ఓం నమశ్శివాయ
మాయా మాయా
ఆ విభూతి మాయా!
ఈశ్వరా సర్వేశ్వరా
ఓ మా మహేశ్వరా
రావా ప్రియ శంకరా
మా అభయంకరా !
శ్రీకరా ఓ శుభకరా
శీఘ్రంగా గంగాధరా
వరమీయగ ఇక రారా
మా మదిని నువుచేరా!
ఓ మా పరంధామా
నీవే ఇక మా ధీమా
అశుభాన్ని తొలగించు
ఇల శుభాన్ని వెలిగించు !
హర హర శంభో ఈశ్వర
పావనగంగా మహేశ్వర
గిరిజా ప్రియ మా శంకర
వరమీయగ అభయంకర
రావా ఇక ఓ మా దేవ దేవా
మొర వినవా మహానుభావా
ఇల నీవేగా మరి మాకిక దిక్కు
స్వీకరించుమా మా ఈ మక్కు!
మా మొర ఇక వినవా శివశివ
మా మోక్షానికి చూపించు త్రోవ
మిమ్ములనే సదా జపిస్తున్నాం
మా కైవల్యానికి తపిస్తున్నాం !
ఓం నమశ్శివాయ శివాయా
ఈ హవిస్సు అందుకోవయా
మా మనస్సులోన నీవయా
తమస్సును తొలగించవయా !
మాఆది దేవుడవు నీవయ్యా
మమ్మాదరించ ఇక రావయ్యా కొండంత దేవుడవు నీవయ్యా
మా అండదండవై రావయ్యా!
మా భక్తితో నిన్నే కొలిచదము
అనురక్తితో నిత్యం తలచదము
జపిస్తూ నీ ఎదుటే నిలచదము
తపిస్తూ మేమంతా వలచేదము!
నమశ్శివాయ నమశ్శివాయ
ఓం నమశ్శివాయ ఓం హరాయ
ఓం నమోనమ సదాశివ సాకారా పరమశివ మా నిర్గున నిరాకారా!
ఓం విభూతి ప్రియ వినోదరాయ
రుద్రాక్ష భూషణ దరహాస రాయ
దివ్య మంగళ మారేడు ధళరాయ
సర్వాంతర్యామి మాసర్వేశ్వరాయ
కాలకంఠ నన్ను కరుణించు స్వామి
ఇలమా ఇంటనిలచి ఉద్ధరించవేమి
ఏది అడిగినా ఇచ్చేటి ఓ దివ్యదేవా
అడిగిన వరమిచ్చి ఆలకించరావా !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.