పిల్లలమర్రి పిల్లలం (బాల గేయం). సహస్ర ముత్యాల అవార్డు గ్రహీత గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

పిల్లలమర్రి పిల్లలం (బాల గేయం). సహస్ర ముత్యాల అవార్డు గ్రహీత గుర్రాల లక్ష్మారెడ్డి .కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

పిల్లలమర్రి పిల్లలం (బాల గేయం)
-------------&&&&&&&-----------------పిల్లలమర్రి పిల్లలం
తెల్లని వన్నెల మల్లెలం
పాలమూరు వారలం
పాలు గారు పోరలం!

మా ఊరు పాలమూరు
 ఉంటుంది జోరుదారు
వీక్షించితే ఇక మీరు
హర్షించగా ఉండలేరు!

మెట్టుగడ్డ ప్రాంతమందు
పిల్లల మర్రి క్రింద విందు ప్రతినిత్యం చేసుకుంటాం
వ్రతకృత్యం చూసుకుంటాం!

పిల్లలమర్రి చెట్టు కింద ఆడుకుంటు
పుట్ట తేనె పట్టు గాను జుర్రుకుంటు
కలసి మెలసి ఆటలే ఇక ఆడుతాం
అలసి సొలసి పాటలే  పాడుతాం !

ఊడల ఉయ్యాల్లో ఊపేస్తుంది
నీడల వాడల్లోమము దింపేస్తుంది
అమ్మ లాగా మమ్ముల ప్రేమిస్తుంది
గుమ్మ పాలు గమ్మున తాపిస్తుంది !

ఎనిమిది వందల ఏళ్ల నాటి చెట్టు
మూడున్నర ఎకరాల్లో తన పట్టు
బివిస్తూ విస్తరిస్తూ  వస్తూనేఉంది
చిగురుస్తూ పచ్చగాను తానుంది !

పిల్లలమర్రి సుందర వృక్షం
పర్యాటక ప్రజలందరి పక్షం
శతమానం భవతేగా లక్ష్యం
శతాబ్ది చరితకు ఇది సాక్ష్యం !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments