శివుడు-పంచవతారములు. (వ్యాసం). సహస్ర ముత్యాల అవార్డు గ్రహీత, బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం .సెల్.9491387977.

శివుడు-పంచవతారములు. (వ్యాసం). సహస్ర ముత్యాల అవార్డు గ్రహీత, బాలమిత్ర గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం .సెల్.9491387977.

శివుడు-పంచ అవతారములు.
-------------&&&&&&----------------
శివుడు ఎత్తిన అసంఖ్యాక అవతారములలో ప్రధాన అవతారములు ఐదు (5).
1). సద్యోజాతుడు.
2). ఈశానుడు.
3). అఘోరుడు.
4). తత్పురుషుడు.
5). వామదేవుడు.
        వీనినే శివుని పంచావతారములు, పంచ బ్రహ్మ లని కూడా అంటారు.
1.సద్యోజాతుడు
శ్వేత లోహిత కల్పములో శివుడిని ధ్యానించుచున్న బ్రహ్మ నుండి శిఖతో కూడినవాడు, తెలుపు, ఎరుపు రంగు గల శివుడు అతనికి కుమారునిగా జన్మించెను. శివుడే తనకు కుమారునిగా అవతరించాడని బ్రహ్మ భక్తితో నమస్కరించెను. ఈ అవతారమునే సద్యోజాత అవతారమని అంటారు. వేదం సద్యో జాతుని గురించి
సద్యోజాతుని ముఖము చంద్రుని వలె, తెల్లని పాలవలె, శ్వేత కలువ పువ్వు వలె, లేత పసుపు రంగు కలిసిన తెలుపు రంగుతో, ధవళ కాంతితో ప్రకాశించునని తెలిపినది.
2). ఈశానుడు
విశ్వరూప కల్పములో బ్రహ్మ తుని కోరి శివుని ధ్యానించుచుండగా, స్పటికము వలె ప్రకాశించువాడు, ఆభరణములతో అలంకరించబడిన, సుందరాకారుడైన కుమారుడు అవతరించెను. శివుడే తనకు పుత్రునిగా జన్మించాడని బ్రహ్మ తలచి నమ్రతతో నమస్కరించెను. ఈ అవతారమనే ఈశా నవతారమని అంటారు. ఈశాన అవతారుడుని గురించి వేదం
మధ్యాహ్న సూర్యుడిలోని స్పటిక శ్వేత నిర్మలాకాశ వర్ణముతో ఈశానుని ముఖము శుద్ధ స్పటికము వలె ప్రకాశించునని తెలిపినది.
3). అఘోరుడు
శివ కల్పమందు బ్రహ్మదేవుడు సృష్టి నిమిత్తమై వేయి సంవత్సరాలు శివుని గూర్చి తపస్సు చేయగా, అప్పుడు గొప్ప తేజోవంతుడు, మహా పరాక్రమశాలి, నల్లని వస్త్రాలను, నల్లని యజ్ఞోపవీతమును, నల్లని కిరీటమును ధరించిన నల్లని రంగు గల కుమారుడు జన్మించెను. శివుడే తనకు కుమారునిగా జన్మించాలని తలచి బ్రహ్మ భక్తితో నమస్కరించెను. ఈ అవతారమునే అఘోర అవతారమని అంటారు.
అఘోరిని గురించి వేదం
అఘోర మూర్తి ముఖము మేఘము వలె పొగలాగా నీలము, నలుపు కలిసిన నల్లని తుమ్మెద నీలపు వర్ణముతో ప్రకాశించునని తెలిపినది.
4). తత్పురుషుడు
పీతవాసం కల్పములో బ్రహ్మకు శివుడే కుమారునిగా జన్మించారు. బ్రహ్మ శివునికి నమస్కరించి, తేజో వంతుడైన, గంభీరుడైన, మహా బాహుడైన తత్పురుషునికి మొక్కి సంతోషించాడు. ఈ అవతారము నే తత్పురుష అవతారం అంటారు.
ఈ అవతారం గురించి వేదం
ప్రళయాగ్నిలో వెలిగే విద్యుత్ కాంతి వంటి వర్లముతో తత్పురుషుని ముఖము ప్రకాశించుచున్నదని తెలిపెను.
5) వామదేవుడు
రక్తకల్పమందు బ్రహ్మ శివుని గూర్చి తపస్సు చేయగా శివుడే కుమారునిగా జన్మించే. అందుకు బ్రహ్మ సంతోషించి శివునికి నమస్కరించను. శివుడు ఎర్రని మాలను, ఎర్రని వస్త్రాలను, ధరించి ఎర్రని కన్నులతో ఉండెను ఈ అవతారమునే వామదేవ అవతారమని అంటారు. ఈ అవతారం గురించి వేదం
మొగిలిపువ్వు వర్ణముతో లేక
గౌరవర్ణముతో వామ దేవుని ముఖము ప్రకాశించునని తెలిపినది
       ఈ పంచ ముఖముల నుండి ఏడు కోట్ల మంత్రములు జన్మించినవి. ఈ మంత్రముల వలన అనేక విద్యలు ఆవిర్భవించినాయి.
ఇలా పంచముఖ పరమేశ్వరుని మనం నిత్యం మనసారా కొలిచి, పూజించి తరిధ్ధాం.

శివోహం శివోహం శివోహం.

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ 9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments