ప్రత్యక్ష దైవాలు.(మణిపూసల ప్రక్రియ). సహస్ర ముత్యాల హాలాల అవార్డు గ్రహీత, బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

ప్రత్యక్ష దైవాలు.(మణిపూసల ప్రక్రియ). సహస్ర ముత్యాల హాలాల అవార్డు గ్రహీత, బాలమిత్రుల గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి. నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్ నెంబర్.9491387977.

ప్రత్యక్ష దైవాలు. (మణిపూసల ప్రక్రియ గేయం)
------------------+++++++--------------
గీత దాటని పిల్లలం
రాతమారిన మల్లెలం
మేం సదా వెలుగుతుంటం
కలిమి కలిగిన పోరలం  !

మణిపూసలంటే ఇష్టం
రాయడమే మాకు కష్టం
అయిననూ రాస్తున్నాము
అని చేస్తున్నాం స్పష్టం !

మాకు అమ్మానాన్నలు
ఆరాధ్య దైవాలు
మేం వారిని పూజిస్తాం
వారు వెలిగే దేవతలు !

వారిక మా ఇష్టాలను
మేం పడేటి కష్టాలను
రోజూ చూస్తుంటారు
తీర్చేరు మా కలలను !

కోరుకున్నవి ఇస్తారు
మంచీ చెడు చూస్తారు
ఉంటారిక మా వెంట
మమ్ములను దీవిస్తారు !

చెప్పినట్లుగా వింటాం
నిత్యం బడికి పోతుంటాం
వారికి మాటే వేదం
అని తలస్తూ మేముంటాం !

మాకు గురువంటే ప్రేమ
వారే మాకిక ధీమా
బోధిస్తారు పాఠాలను
పడతారు మాకై శ్రమ !

ఆ బడిలో చదివింక
మేమెంతో ఎదిగింక
వస్తాంగా గురువు కడకు
పూజిస్తాం వారినింక !

గురుభక్తి చాటుకుంటూ
వారు మా  దేవుడంటూ
ఇక ఇలమేం భావిస్తాము
వారినిక పొగుడుకుంటూ !

అమ్మా నాన్నలు గురువులు
కనిపిస్తున్న దేవతలు
మన వెల్లంటే ఉంటారు
అందిస్తారు కడు శుభములు !

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments