శీర్షిక: అమరులత్యాగం
సొంతగడ్డపైనే
బానిసత్వం ఎంత నరకం
వ్యాపారం ముసుగులో
నీచమైన ఆలోచనతో
దేశమంతా ఆక్రమించడం
వాడి నైజం
వనరులన్నీ మనవి పెత్తనం వాడిది
కష్టమంతా మనది
సంపదంతా దోపిడి
దౌర్జన్యంతో అణిచివేత
ఎంత దౌర్భాగ్యం
నా భరతమాత దాస్యశృంఖాలలతో బందియై
ఎంత క్షోభననుభవించిందో?
తన ఒడిలో బతుకుతున్న
తన పిల్లల బాధచూసి
ఎంత తల్లడిల్లిపోయిందో?
సస్యశ్యామలంగా విలసిల్లే దేశంలో
ఎడారి బతుకులయ్యాయపుడు
కొందరు చైతన్యవంతులు
అందరినీ ఐక్యం చేసి
పరాయి పాలనపై తిరుగుబాటు చేసారు
దేశంకోసం కాయలర్పించారు
భరతమాత గాయాలను తొలగించి
దేశమంతా స్వేచ్ఛా వాయులు ప్రసరించారు
అమరుల త్యాగాలే
మనం గడిపుతున్న స్వేచ్ఛ జీవితాలు
మరవొద్దు వారి త్యాగాలు
దేశ గౌరవాన్ని నిలిపె వారసులమవ్వాలి
ప్రవళిక
10వ, తరగతి,
జి.ప.ఉ.పాఠశాల అమడబాకుల,
వనపర్తి జిల్లా
8919281017