నాన్న నీకు వందనం. రచన : మోతిలాల్ ఆరె కటిక

నాన్న నీకు వందనం. రచన : మోతిలాల్ ఆరె కటిక



"నాన్న" 
అమ్మ కడుపులో మేము   
ఎదుగుతున్న వేళ నీ
 ఆనందాలకు హద్దుల్లేవు
నాన్న నీ మధురనుభుతికి
వందనం

మేము ఈ లోకంలోకి వచ్చిన మరుక్షణమే మమ్మల్ని
కౌగిలిలో  ఎత్తుకొని ముద్దులు పెట్టినవు నాన్న నీ ప్రేమకు వందనం

మా చేయి పట్టి మమ్మల్ని నడక నేర్పించావు
ఏ కష్టం తెలియకుండా మమ్మల్ని పెంచి పెద్ద చేశావు
నాన్న నీ పెంపకానికి వందనం

 మాకు ఏ లోటూ లేకుండా,
ఏ బాధ తెలియకుండా 
మమ్ములను పెంచి నావు
ఎల్లప్పుడూ
మా మంచిని కోరుతావు 
నాన్న నీ మంచి మనసుకి వందనం

కష్ట లు వచ్చిన, 
కన్నీళ్లు వచ్చిన,
 నీలోనే దాచుకుంటావు
మా....కడుపు నింపే ప్రయత్నం చేస్తూ నీవు పస్తులున్న రోజులెన్నో గడుపుతావు
నాన్న నీ పేగు బంధానికి వందనం

మా భవిష్యత్తు కై నీ నెత్తురు నే
చెమట గా మార్చి
 అలసిపోతునే సంబరా పడతావు

నాన్న   నీ జీవితాన్ని మాకోసం   అంకితం చేస్తావు
నాన్న నీ కర్తవ్యా నికి వందనం

9441 63 2348

0/Post a Comment/Comments