నాగలి పట్టి దుక్కి దున్ని
విత్తులు విత్తడం
సలు సలుకి
నీరు పెట్టడం
మొలకెత్తిన పంటను
కంటికి రెప్పల కాపాడుకోవడం
పంట ఎదిగే కొద్దీ
చీడ పురుగుల కోసం
పంట ఎదుగుదల కోసం
యూరియా ఇతర మందులు
చల్లాడం
మందులు పిచికారీ చేయడం
రాత్రి వేళల్లో సైతం పంటకు కావలి ఉంటాడు రైతు
సమయానికి వర్షాలు లేక
పదుల సంఖ్యలో బోర్లు వేసి
తనువు చాలించిన రైతులు ఎందరో
అప్పుల ఉబిలో చిక్కి
చితికిల పడిన రైతులు కుటుంబాలు ఏన్నో
నకిలీ మందులు
అకాల వర్షాలు
మద్దతు ధరలు లేకపోవడం
ఇలా రైతుని కష్టాల కడలిలో కూరుకు పోయేలా చేస్తున్నాయి
రైతన్న దుక్కి దున్ని ఆరుగాలం కష్టించి పంట పండించిన పాపానికి తప్పని కష్టాలు
రైతు కష్టపడి పండించిన
పంటకు మద్దతు ధర లేక నష్టపోతున్నది
నేటి రైతాంగం
అడవి పందులు సర్పాలు ఇలా అన్నిటి నుండి తన ప్రాణాలకు
ముప్పు ఉన్న ఆ.. గండం నుండి తన ప్రాణాలకు తెగించి
పంటను రక్షిస్తాడు రైతు
రైతు కు అన్ని కష్టాలే
నకిలీ మందులు ఓ పక్క
అకాల వర్షాలు ఓ పక్క
రైతులంటే దళారులకే కాదు ప్రభుత్వానికి చిన్నచూపే
పాపం దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఎన్ని బాధలు
ఆవులను బర్రె లను ఎద్దులను
అపురూపంగా చూసుకుంటాడు రైతు
అంతటి మహోన్నత మనసున్న రైతు దుక్కి దున్ని పంట వేయడం తప్ప
ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా భూమిని నమ్ముకొని పంట పండించడం తప్ప
ఏమిటీ రైతు చేసిన పాపం
రైతే దేశానికి వెన్నెముక అంటారు కానీ
నకిలీ మందుల అరికట్టలేక
రైతులు పండించిన పంట కి మద్దతు ధరలు ఇవ్వలేక
రైతుల నడ్డి విరుస్తున్నారు
రైతుల కష్టాలు తొలగిపోవాలి
రైతు కన్నీరు కష్టాలు దూరం కావాలి
రైతు ఆనందంగా ఉన్న నాడు
దేశం ప్రపంచం ఆనందంగా ఉంటుంది.
రైతు రాజు గా మారే రోజులు రావాలి
రచన :
మోతీలాల్ ఆరె కటిక
గాంధారి( గ్రామం, మండలం)
కామారెడ్డి జిల్లా
9441632348