నేడే ఎడ్లపొలాల అమావాస్య

నేడే ఎడ్లపొలాల అమావాస్య

నేడే ఎడ్ల పొలాల అమావాస్య
ప్రాముఖ్యతను వివరించిన కవి
లెక్చరర్ ఉమశేషారావు వైద్య
కామారెడ్డి జిల్లా దోమకొండ

 రైతులు తమ తో పాటు తన చెనులో ,చెలక లో పనిచేసి పండించే పంటకు కారణం అయిన ఎడ్లను పూజించడం తో మానవునికి పాశువుల పట్ల కారుణ్యతను తార్కాణం.ఈరోజు ఎడ్లకు స్నానం చేయించి,కొమ్ములకు నూనె రాసి,గుడాలు, పోలేలు చేసి తినిపించి కృతజ్ఞతను చాటుకుంటారు.తెలంగాణ లో కొన్ని ప్రాంతాల్లో జాతరగా జరుపుతారు
    దీన్నిమరొక కోణం లో ఆచరిస్తారు.సంతానం లేని వారు సంతానం ఉన్నవారు రక్షణకో సం చేసే వ్రతం.సంతాన సంరక్షణకోస0 ఆచరించే వ్రతం.శ్రావణ శుద్ధ బహుళ అమావాస్య రోజు ఈ వ్రతం ఆచరిస్తారు
     గోమూత్రం తో అలికి, వరి పిండి తో ముగ్గులు వేసి అమ్మవారి చిత్ర పటం ఉంచడం తో పాటు కంద మొక్కను ఉంచి దానికి తొమ్మిది వరుసల దారం కట్టి అమ్మవారికి షోడోపచార పూజలు నిర్వహిస్తారు.తర్వాత ముత్తైదువను పిలిచి భోజనం పెడతారు
    వ్యవసాయం లేని వారు ఎద్దు బొమ్మలను మట్టితో తయారు చేసి,పశువుల కాపారి బొమ్మను కూడా తయారు చేస్తారు.పూజాగదిలో జాజు తో పొలాలు గీస్తారు
    అసలు పొలాల అమావాస్య ఎందుకు చేస్తారు అంటే పూర్వకాలం లో ఒక్క కుటంబం లో ఎనిమిది మంది సంతానం మగపిల్లలు ఉంటారు.తల్లిదండ్రులు అందరి కొడుకులకు పెళ్లిళ్లు చేసి ఆనందంగా ఉంటారు.అయితే చివరి కొడలుకు సంతానం కల్గిన పుట్టగానే అమావాస్య రోజు మరణించడం జరుగుతుంది.తోటి కోడళ్ల సూటి పోటీ మాటలతో  హేళన చేస్తారు.చివరగా కల్గిన సాంతనాన్ని చాపలో చుట్టి స్మశాననికి తీసుకొని పోయి ఏడుస్తూ ఉంటుంది ఆ స్త్రీ.అప్పుడు మారువేషంలో ఉన్న పర్వతిపారమేశ్వరులు ఏమైంది అని ప్రశ్నిస్తారు అప్పుడు ఆ స్త్రీ మీరు ఆ ర్చే వారా అంటూ నిట్టూర్పు ను ప్రకటించింది ఇది గమనించి పర్వతిపారమేశ్వరులు నీ బిడ్డ బతుకుతూ 0ది అని మాయం అవుతారు.అప్పుడు స్మశానం లోని బిడ్డ బతుకడమే కాకుండా ఇంటి వద్దకు వెళ్ళగానే మిగితా వారు కూడా సజీవంగా ఉండ డం చూసి వచ్చిన వారు పర్వతిపారమేశ్వరులు అని గ్రహించి అప్పటి నుండి అమా వాస్య పూజ నిర్వహి0చింది.సంతాన సంరక్షణ తో పాటు పశువుల పాట్ల భూత దయ చూపాలని చెప్పే పండుగే ఎడ్లపొలాల అమావాస్య

0/Post a Comment/Comments