పుస్తక పఠనం-గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు

పుస్తక పఠనం-గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు

పుస్తక పఠనం
------------------------------
పుస్తక పఠనం
ఎంతో మంచిది
మస్తకానికది
ఔషధంలాంటిది

వినోదమిచ్చును
వికాసమబ్బును
మెదడుకు చాలా
సాయము చేయును

మౌన పఠనమే
ఆరోగ్య కరము
మానసికంగా
చేయును దృఢంగా

మంచి స్నేహితుడు
మహిలో పుస్తకం
మదిలో నెమ్మది
పెంచును పుస్తకం

ధారణ శక్తిని
ఎక్కువ చేయును
చంచల మనసును
కుదురుగా ఉంచును

పుస్తకాన్ని చుదువు
జీవితాన్ని గెలువు
విజ్ఞాన తరువు
నీడలో నిలువు

-గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు,
సెల్:9966414580.

0/Post a Comment/Comments