ప్రభుత్వ డిగ్రీ కళాశాల వర్ధన్నపేట లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న డా.ప్రతికంఠం మాలతీలత సాహితీ ప్రవీణ పురస్కారానికి ఎంపిక అయ్యారు. ఈ నెల 29 న మాతృ భాషా దినత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో ఉమెన్ అండ్ యూత్ ఆధ్వర్యం లో ఈ అవార్డు ఇవ్వబోతున్నట్టు
సంస్థ వ్యవస్తాపక అధ్యక్షులు అంజయ్య గారు తెలిపారు. ఈ సందర్భంగా మాలతీలత ను అభినందించారు