స్నేహం

స్నేహం

స్నేహం హితం కోరేది
స్నేహం ఒక మధురం
స్నేహం ఒక ఓదార్పు
స్నేహం ఒక స్వాంతన
స్నేహం ఒక మార్గదర్శనం

మైత్రి బంధానికి ఎల్లలు లేవు
సరి హద్దులు లేవు
ఆర్ధిక కొలమనలు లేవు
కులమతాల అడ్డుగోడలు లేవు
నిస్వార్థమైన హృదయం మాత్రమే వాంఛనీయం
ఆధునిక కాలం లో స్నేహం
ముసుగులో ఎన్నోధురగతాలు
నమ్మిన వారిని నట్టేట ముంచే వారు నిజమైన  మైత్రిబంధానికి
చీదపురుగులు
విశ్వానికి గురువు కృష్ణుడు
అతి పేదవాడు అయిన కుచేలుడు ఒక నిజమైన
స్నేహానికి నిలువెత్తు దర్పం
పేదవాడు అయిన కుచేలుడు
పిడికెడు అటుకులు ఇచ్చిన
మహాప్రసాదంగా స్వీకరించే
ఎన్నో సమకూర్చే
ఆత్మ అభిమానం కోల్పోకుండా
సిరిసంపదలు చేకూర్చే
చరితలో ఎన్నో ఉదాహరణలు
మంచి స్నేహానికి తార్కాణం
ఆశించి చేయకు స్వార్థం
ఆలోచన ల ముసుగు తొడుగకు
రెండు శరీరాలు వేరు అయిన
హృదయాలు ఒక్కటిగా
సాంగత్యం పొంది
భిన్నాభిప్రాయాలు గౌరవించి
ఎదుగుదల కు ఒక నిచ్చెన
నిలవాలి
హోదా పక్కన పెట్టి
చిలిపిగా గమ్మత్తుగా
పిలుచుకునే బంధం
స్నేహబందం
హితం కోరే స్నేహితము
పవిత్రమై0ది

0/Post a Comment/Comments