ఉత్తమ విజేతగా...
ప్రముఖ సాహితీవేత్త,
ఐ. బి. ఆర్. ఎఫ్ సభ్యుడు చిటికెన
====================
భారతదేశానికి స్వాతంత్రం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా సాహితీ బృందావన విహార వేదిక నిర్వహించిన
ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంబరాల వేడుకల కవితా పోటీలో అధిక సంఖ్యలో కవయిత్రులు ,కవులు, పాల్గొని స్వాతంత్ర పోరాటం గురించి స్వాతంత్ర సమరయోధుల గురించి, స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం సాగిన జాతీయ ఉద్యమం గురించి. భారత జాతి దాస్య శృంఖలాల విముక్తి కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేసిన ఫలితాన్ని గురించి అద్భుతమైన రచనలను దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి సాహితీవేత్తలు రచనలు అందించి దేశభక్తినీ చాటారు.
జాతీయ ఉద్యమంలో అమరులైన వారికి కవిత నిరాజనాలు అర్పించారు.
ఈ కవితా పోటీలలో ఉత్తమ రచనలకి సాహితీ బృందావన విహార వేదిక నుండి ప్రశంసా పత్రాలు అందించాము అని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి నెల్లుట్ల సునీత తెలిపారు.
ఈ కార్యక్రమం వేడుకలలో పాల్గొని విజయవంతం చేసిన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉత్తమ రచనలుగా నిలిచిన వారికి వేదిక నుండి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కవితల పోటీలలో
ఉత్తమ రచనలుగా నిలిచిన వారిలో
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త, ఎడిటోరియల్ కాలమిస్ట్, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యుడు
డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ నిలవటం హర్షించదగ్గ విషయం అని
సంస్థ జాతీయ అధ్యక్షురాలు నెల్లుట్ల సునీత తెలియజేశారు.