*చిటికెనకు ఆచార్య జయశంకర్ స్మారక పురస్కారం*
======================
తెలంగాణ స్ఫూర్తి ప్రదాత మరియు ఉద్యమ వీరుడు, పోరాట యోధుడు ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ గారి జన్మదినం సందర్భంగా ఇటీవల సాహితీ బృందావన జాతీయ వేదిక నిర్వహించిన కవితా పోటీలలో ఉత్తమ కవిత అందించిన ప్రముఖ కవి, రచయిత పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యులు, ఎడిటోరియల్ కాలమిస్ట్ డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ ఎంపికయినందున ఆచార్య జయశంకర్ స్మారక పురస్కారాన్ని అందజేస్తున్నట్లు సంస్థ అధ్యక్షురాలు ప్రముఖ రచయిత్రి, కవయిత్రి, సున్నితం ప్రక్రియ సృష్టికర్త నెల్లుట్ల సునీత తెలియజేశారు. ఈ సందర్బంగా నెల్లుట్ల సునీత మాట్లాడుతూ వ్యాసాంగ రచనల ద్వారా అంతర్జాతీయంగా దూసుకుపోతున్న డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ కు పురస్కారం అందజేయడం హర్షించదగ్గ విషయం
అని అన్నారు. పురస్కార గ్రహీత చిటికెన మాట్లాడుతూ
ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నప్పటికీ ఆచార్య జయశంకర్ పురస్కారం అందుకున్నందుకు ఎంతో ప్రత్యేకంగా ఉందని సంతోషాన్ని వ్యక్త పరచారు.
ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు చరవాణి ద్వారా చిటికెన కు అభినందనలు అందించారు.