శీర్షిక: మహనీయుడు
సమాజాన్ని చదివి
సమస్యల వలయాన్నెలా ఛేదించాలో
తనదైన శైలిలో వైవిధ్యమైన
భావాలతో
సూటిగా కాస్త ఘాటుగా
సమాజ గొడవనంతా
తన గొడవగా అందరిముందుంచిన నిఖార్సయిన కవి
నిర్భయత్వం ఆయన తత్వం
సమాజమెంత దిగజారుడు తనాన్నలంకరించుకున్నదో
దోపిడిసొమ్మంతా దొరలగుమ్ముల్లో
ఎండిన ఎముకలసారాన్ని
జలగలై పీల్చే మోసగాళ్ళ
కపటత్వాన్ని
కరుకుతనాన్ని బెరుకులేకుండ
ఏకరువెట్టిన మేటి కాళోజీ
మతం రంగును పులుముకున్న సమాజం
చాదస్తపు మార్గంలో పయనమైందంటూ
పోటిపడు కాటులాడంటూ
మూఢ భక్తిని నిరసించిన
వెలుగుకిరణం కాళోజీ
పరాయి భాషతో కిరాయివాడౌతున్న మనిషిని
మొహమాటం లేకుండా దండించిన భాషాభిమాని
ఆశనిరాషలతో కొట్టమిట్టాడుతున్న లోకులను
దురాశను దూరంచేసుకోవాలంటూ
ఒక్కమాటలో జీవితమర్మాన్నంతా
నిర్వచించిన నేటిమేటి
నాకున్నది కోరికంటూ
సమషమాజ నిర్మాణానికై
మానవీయతను చాటాడు
(కాళోజీ జయంతి సందర్భంగా)
సి.శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.
హామీపత్రం:
------------------
సంపాదకులు గారికి నమస్కారం, ఈ కవిత నా స్వీయరచన, దేనికి అనుకరణ కాదు.