నాశనం లేని శాశ్వత దైవం శివుడు (వ్యాసం). సహస్ర ముత్యాల అవార్డు గ్రహీత గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్.9491387977.

నాశనం లేని శాశ్వత దైవం శివుడు (వ్యాసం). సహస్ర ముత్యాల అవార్డు గ్రహీత గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి .నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ రాష్ట్రం. సెల్.9491387977.

నాశనం లేని శాశ్వత దైవం శివుడు!
---------------₹₹₹₹₹₹₹₹---------------
ఈ విశ్వంలో సృష్టించబడిన సమస్త జీవులు కాలంతోపాటు నశించక తప్పదు. ఇది సృష్టి అనివార్య సిద్ధాంతం. మానవులైన, రాక్షసులైన, దేవతలైన, పశుపక్షాదులైన, సృష్టించబడిన ఏ జీవైనా మృత్యువుకు గురికావాల్సిందే. కాలములో కనుమరుగు గాక తప్పదు. ఇదేవిధంగా ఇంద్రుడైన, బ్రహ్మ విష్ణువులైన, రుద్ర మహేశ్వరులైనా కాలంతో పాటు కనుమరుగాక తప్పదు. కనుమరుగు కాకుండా, నాశనం లేకుండా శాశ్వతంగా ఉండే దైవం ఒక్క శివుడే. అందుకే శివుడిని కాలాతీతుడు అని అంటారు.
         సర్వస్వాన్ని నాశనం చేసే కాలం, ఒక్క శివుడిని మాత్రం ఏమి చేయలేక పోయింది. అంతేకాదు ఆ కాలాన్ని కూడా నాశనం చేసే మహత్తు ఉన్నవాడు ఒక్క శివుడే. అందుకే శివుడిని మహాకాలుడని, కాల కాలుడని అన్నారు.

అద్వైతం నిష్కలం నిష్క్రీయం శాంతం శివమక్షర మవ్యయం!
అని భస్మ జాబాలో పనిశత్ తెలియజేసింది.
అద్వైత స్వరూపుడు, నిష్కలుడు,
నిష్క్రయుడు, శాంతుడు, క్షీణించనివాడు, నాశనం కాని వాడు ఒక్క శివుడే అని తెలిపినది.
       విష్ణువుకు ఒక్క దినం పూర్తి కాగానే బ్రహ్మదేవుడు కనుమరుగవుతాడు. రుద్రునకు ఒక్క దినం పూర్తి కాగానే విష్ణువు కనుమరుగవుతాడు. మహేశ్వరునికి ఒక్క దినం పూర్తి కాగానే రుద్రుడు కనుమరుగవుతాడు. సదాశివునికి ఒక్క దినం పూర్తి కాగానే మహేశ్వరుడు కనుమరుగవుతాడు ఈ విధంగా అందరూ దేవతలు కనుమరుగవుతారు ఒక్క శివుడు తప్ప. అందుకే పద్మ పురాణం బ్రహ్మ విష్ణువుల ఆయుస్సుల గురించి
సదాశివుడి రెండు నిట్టూర్పులు బ్రహ్మ దేవుని పరమాయు వగును.
సదాశివుడి నాలుగు నిశ్శ్వాసములు విష్ణు దేవుని పరమాయువగును. మహా దైవాలైన బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వరుల ఆయుష్షు వివరాలు ఏమిటో చూడండి కింద.
   ఇంద్రుని ఆయుస్సు----68.57 కోట్ల సంవత్సరాలు.
బ్రహ్మ ఆయుష్షు---5 లక్షల, 40వేల ఇంద్రునికాలం.
విష్ణువు ఆయుష్షు---శతబ్రహ్మల జీవితకాలం.
రుద్రుడి ఆయుష్షు-----శత విష్ణువుల జీవితకాలం.
మహేశ్వరుడి ఆయుష్షు---శతరుద్రుల జీవితకాలం.
జీవులను సృష్టించే బ్రహ్మ కాలంతోపాటు కనుమరుగు గాక తప్పదు. జీవులను రక్షించే విష్ణువు కనుమరుగాక తప్పదు. జీవులను సంహరించే రుద్రులు కూడా కనుమరుగు కాక తప్పదు. జీవులు చనిపోయిన తర్వాత జీవుల ఆత్మలను రక్షించే మహేశ్వరులు కూడా కనుమరుగుగాక తప్పదు.
కాలంలో కనుమరుగు గాని దైవం, ఒక్క శివుడు మాత్రమే. కాలానికి అతీతమైన దైవం ఒక్క శివుడే.
అందుకే శాండిల్యోపనిషత్
శివం ప్రశాంతం అమృతం తత్పరం
ఛీ బ్రహ్మ. అని అంది.
ముఖ్యమైన వాడు, శాశ్వతమైన వాడు శివుడు మాత్రమే. ఏకరూపమున ఉండే దైవాన్ని శాశ్వతుడని అంటారు. ఈ లక్షణం ఒక్క శివుడికే ఉంది. ముక్కోటి దేవతలలో ఎవరికి లేదు. అందుకే పరమశివుని శాశ్వతం అని శివుని అష్టోత్తర శతనామావళిలో ఉన్నది. కాబట్టి కాలంతో సంబంధం లేని, కాలాతీత ఏకైక దైవం ఒక్క శివుడే.
కావున ఇట్టి శివుడిని మనందరం నిత్యం చక్కగా ఆరాధిద్దాం. ఆ ఆరాధనలో లీనమై మనము కూడా శాశ్వతులమై మోక్షమును పొంది తరిద్దాం.
ఓం నమశ్శివాయ. ఓం నమశ్శివాయ. ఓం నమశ్శివాయ.

గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్ 9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.

0/Post a Comment/Comments