వజ్రోత్సవ గీతిక !
------------------------
వచ్చెనండి వచ్చెనండి వజ్రోత్సవ వేడుకలు
వచ్చేసిన అథితులకు అందిస్తాం కానుకలు
మన దేశ ప్రజల సఖ్యతయే అందరికి ముఖ్యం
అప్పుడే అందరికీ ఇక కలుగుతుంది సౌఖ్యం !
కవులు కూడా ఉన్నారు కళాకారులు ఉన్నారు
కనుల ముందు వారంతా కనబడు తున్నారు
స్వాతంత్ర యోధులంతా వస్తున్నారు
సార్వోభవవాదులై మస్తుగున్నరు
సారస్వత సరస్వతిని కొలుస్తున్నరు !
విచ్చేసిన వచ్చేసిన మన నాయకులందరికి
మనమంతా సత్కరించి కదలాలి ముందరికి
ఎందరో మరెందరో మహానుభావులందరికి
వందనాలు వందనాలు మా ఉద్యమ చందనాలు !
రండి రండి రండి మీ ఐక్యతా బలం చూపండి
ఉద్యమ రథసారథులై మునుముందుకు కదలండి
ప్రజలను నడిపిస్తూ ప్రజా విప్లవాల వివరిస్తూ
ఓ భారతీయ మిత్రులారా మా భారత మాత పుత్రులారా !
లెండి లెండి లెండి తెగించి మీరు కదలండి
అపర కాళికలై ఇకనుండి విజృంభించాలండి
మా సహోదరీ రచయిత్రులారా మీరంతా ముందుండి
మీ సాహసాల జైత్రయాత్ర నడుపుటకై నడవండి !
అనైక్యతకు మీరు ఉండాలి ఆమడ దూరం
సమైక్యతకు పట్టంకట్టుట కాదులే భారం
జాతి సమైక్యతకు నడుంకట్టి ముందుకు నడుద్దాం
దేశం కోసం మన ప్రాణమైన లెక్కచేయక విడుద్దాం !
నేటి ఈనాటి వజ్రోత్సవాల పండుగ
ఆత్మ బలాన్ని ఇచ్చెనులే నిండుగ
అంతా కలిసిమెలిసి నడవాలి ముందుకు
మన జాతీయ ఐక్యతా బలాన్ని చాటేటందుకు!
జాతి సమైక్యతకు ఆధ్యుడు మన జాతిపిత
జ్ఞాతి కలహాలకు వైద్యుడు చాచా నెహ్రూ నేత
వారి నీడలో మనవాడలో ఉద్యమాన్ని నడిపిద్దాం
అనైక్యతా ఉరుల నుండి మన జనాన్ని విడిపిద్దాం !
గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.
సెల్.9491387977.
నాగర్ కర్నూల్ జిల్లా.