దళితులు అంటే కేవలం ఎస్సీలా?

దళితులు అంటే కేవలం ఎస్సీలా?

  దళితులు అంటే కేవలం ఎస్సీలా?

సంఘటిత శక్తికి మారుపేరుగా ఉన్న దళిత పదాన్ని కూడా అంటరానిదాన్ని చేస్తున్న అగ్రవర్ణ భావజాలాన్ని ముక్తకంఠంతో అడ్డగించాలి.


  దళిత అనే పదానికి ఖండిచబడిన, వేరు చేయబడిన అనే నిఘంటు అర్థాలున్నాయి. జన సమూహం నుండి వేరు చేయబడిన  ఉత్పత్తికి మూలమైన వాళ్ళను, అభివృద్ధికి బాటలు వేసే మూలవాసులను, ఆదివాసులను అంటరానివారిగా ముద్రవేసి కులాల పేరుతో నిచ్చెన మెట్లసమాజాన్ని సృష్టించి ఒకరిని ఒకరికి కలవకుండా ఖండిచబడి బీసీ, ఎస్సీ, ఎస్టీలు గా విభజించబడి పాలించబడుతున్న ఈ దేశపు నిజమైన వారసులు దళితులు. ఎంతో విస్తృతార్థంతో కూడుకుని ఈ దేశపు 90% ప్రజల సంఘటిత శక్తిని ప్రకటించే దళిత పదాన్ని కుట్రపూరితంగా ఎస్సీలకు మాత్రమే వర్తింపజేసేలా ఏకమైతున్న సబ్బండవర్గాల ఐక్యతను నిర్వీర్యం చేసేలా పావులు కడుపుతున్న ఈ అగ్రవర్ణ ఆధిపత్య భావజాలాన్ని తిప్పికొట్టేందుకు బహుజన బిడ్డలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఫూలే అంబేద్కర్ వారసులైన ఈ జాతి బిడ్డలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరు మన జాతి హక్కుల్ని కాపాడేందుకు సైనికుల్లా నిలబడాలి.


జై భీమ్ !!


- రాజేంద్ర, 9010137504.

0/Post a Comment/Comments