బకాయీల మతలబులు మనకేల
అధికారుల కొమ్ముగాసేవారు ఒకరు
ప్రభుత్వాలకు అండగా వుండేవారు మరొకరు
అంతా ఒకగూటి పక్షులమే మనమంతా
కాకపోతే మీది *"ఓపీఎస్"* మాది *"సీపీఎస్"*
రిటైర్మెంట్ అంటే మీకు పండగ
కాకపోతే బతికివుండడమే భారం మాకు
ప్రమోషన్ల మాట పరిపరి విధాల మీనోట
పండిట్ల గోస పట్టీపట్టనట్టు ఆంటీ ముట్టనట్టు
టీచర్ ఎమ్మెల్సీలు లేకున్నా బాగుండు
అంతా కూడగొడితే పదివేలు లేరాయే "పండిట్లు"
ప్రభుత్వ టీచర్ల పేరు చెప్పి
పుష్కర కాలంగా ప్రమోషన్లకు తెర
ఒక్క ప్రమోషన్లేకుండానే పదవీ విరమణ
పుక్యానికే జీతాలని గొడ్డు చాకిరీకి గుర్తింపు
ప్రెస్ మీటులు పేపర్లో పడుతున్నదేమిటి
నిధుల కేటాయింపులు బకాయీల జీతాల చెల్లింపు
ఊరగొడుతున్నరు ఊదర గొడుతున్నరు
అసలు విషయాన్ని "తొక్కిపడుతున్నారు".
జయహో తెలంగాణ జయ జయ ద్వానాల తెలంగాణ
కోరికట్టుకున్న మొగుడు కొడుతుండని ఎవరికి చెప్పుకునేది
కాళ్ళు బొబ్బలెక్కి కళ్ళెంబడి రక్తం కారినా
పుట్టిన కర్మానికి తల్లిని కన్నందుకు ఈనేలను
బతికున్నన్నినాళ్ళు విడిచిపెట్టలేము
- రాజేంద్ర, 9010137504