ఎవరిది ఈ దేశం

ఎవరిది ఈ దేశం


ఈదేశం హిందులవులదా 
లేక ముస్లింలదా...? 
అన్నదమ్ములకంటే మిన్నగా
కలిసివుంటున్న హిందూముస్లింలను 
వేరుచేసే ఈ పంచాయితీలు... ఎందుకు? 

ఎవరో ఒకరు పనిగట్టుకొని గుర్తుచేస్తే గాని 

ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోరు... 

కష్టపడందే ఎవరికీ నాలుగు 

వేళ్ళు నోట్లోకి వెల్లవు... 


జనంమీద బతికి తిన్నది 

అరగని సోమరులు మాత్రమే 

ఇంకో మతంమీద బురద జల్లుతారు…


కేవలం కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాల కోసం 

మతం ఉపయోగపడటం శోచనీయం

బతకడమే భారమైన వారికి 

మత పట్టింపులు హాస్యాస్పదం... 


కులం మతం కాక మానవీయతే పట్టెడన్నం 

పెడుతుందని భారతీయులందరికీ తెలుసు... 

కానీ కొందరు స్వప్రయోజనాలకోసమే 

ఇప్పటికీ విభజించి పాలిస్తున్నారు... 


మతం పేరుతో జరిగే మారణకాండకు 

కారణమవుతున్నారు. 

చరిత్ర వారిని ఎన్నటికీ క్షమించదు!!


- రాజేంద్ర

90101375040/Post a Comment/Comments