"డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ" అవార్డుకు గద్వాల సోమన్న ఎంపిక-గద్వాల సోమన్న

"డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ" అవార్డుకు గద్వాల సోమన్న ఎంపిక-గద్వాల సోమన్న

"డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ" అవార్డుకు గద్వాల సోమన్న ఎంపిక
--------------------------------------
పెద్దకడబూరు మండల పరిధిలోని హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త గద్వాల సోమన్న "డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ"అవార్డుకు ఎంపికయ్యారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకోవడమే కాకుండా ,అచిర కాలంలోనే దాదాపు 23 పైగా పుస్తకాలు వ్రాసి,ముద్రించి తన ప్రతిభను చాటుకున్నారు.గణితో పాధ్యాయుడైనా తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా బాలసాహిత్యంలో  గద్వాల సోమన్న విశేష కృషి చేసినందులకుగాను వీరి ప్రతిభను గుర్తించి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా  "అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంస్థ,ఆదరణ వెల్ఫేర్ సొసైటీ"' మార్కాపురం,ప్రకాశం జిల్లా ,ఈ సంస్థ చైర్మన్ శ్రీ గొట్టేముక్కల చెన్నకేశవులు మరియు కార్యవర్గం ఈ అవార్డు కు సోమన్న ను ఎంపిక చేశారు.ప్రతిష్టాత్మకమైన అవార్డు కు ఎంపికైన గద్వాల సోమన్నను  తోటి ఉపాధ్యాయులు ,శ్రేయోభిలాషులు మరియు విద్యార్థులు అభినందించారు.

0/Post a Comment/Comments