నేటి మహిళకు చాకలి ఐలమ్మ ఆదర్శం

నేటి మహిళకు చాకలి ఐలమ్మ ఆదర్శం

- చాకలి ఐలమ్మ
వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామంలో ఓరుగంటి మల్లమ్మ, సాయిలుకు నాలుగవ సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించింది. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది. వీరికి ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం, చాకలి కులవృత్తే వారికి జీవనాధారం. 1940-44 మధ్య కాలంలో విస్నూర్ లో దేశ్ముఖ్, రజాకర్ల అరాచకాల పై ఎదురు తిరిగి ఎర్రజెండా పట్టింది
ఆమె
     ఒక తిరుగుబాటు బావుటా
పోరాటానికి డిగ్రీ లు కాదు
ఖలేజా ముఖ్యం
రజాకార్ల ఆగడాలకు అడ్డుగా నిలిచి
దేశముక్ ల భూస్వామ్య పు పోకడలు ఎదిరించి
భూమి కోసం పోరాడిన
ఐలమ్మ  తెలంగాణ జాతి రత్నం
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి కీలకతు రాయి
అన్యాయాన్ని ఎదిరించి
అభ్యుదయ భావాలకు
బీజం పోసి మహిళ శక్తి కి
నిరూపమానం ఐలమ్మ
నీ జ్ఞాన పాకాలు పదిలంగా
మదిలో స్ఫూర్తి నింపుతూనే ఉంటాయి
ఉమశేషారావు వైద్య
లింగాపూర్,కామారెడ్డి
9440408080

0/Post a Comment/Comments