Pravahini *ప్రపంచ శిఖరాగ్ర సదస్సు ఆహ్వానం*
 *అందుకొన్న సాహితీవేత్త -డా.చిటికెన* 

 ===================

           అంతర్జాతీయ స్థాయిలో  వివిధ దేశాలనుండి ప్రపంచ శాంతి కొరకై పాటుపడుతున్న ప్రతినిధులతో
ఈ నెల 18 తేదీన ప్రతిష్టాత్మకంగా జరుగబోతున్న  8వ హెచ్. .డబ్యూ. పి. ఎల్ ( హెవెన్లీ కల్చర్, వరల్డ్ పీస్, రిస్టోరేషన్ ఆఫ్ లైట్. దక్షిణ కొరియా  ) సియోల్  సంస్థ  అంతర్జాల ప్రపంచ శిఖరాగ్ర సదస్సుకు తెలంగాణ రాష్టం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన  ప్రముఖ సాహితీవేత్త, ఎడిటోరియల్ కాలమిష్ఠు, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యుడు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్  ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుపు అందుకున్నారు.
 చిటికెన సమాజ చైతన్యం పరంగా రచించిన "చైతన్య స్ఫూర్తి" - చిటికెన వ్యాసాలు వ్యాస సంపుటి గ్రంధాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ చేతులమీదుగా వెలువరించటం జరిగింది.  ఇప్పటివరకు 600 పైచిలుకు రచనలను 50 పైగా పత్రికలకు కథలు, కవితలు,వ్యాసాలు పుస్తక సమీక్షలు విశేషణ,విమర్శణా పూర్వకంగా అందించి  ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ కల్చర్  అండ్ డిప్లమాటిక్ రిలేషన్స్ వారి ఆధ్వర్యంలో శ్రీలంక దేశ ప్రతినిధులచే గ్లోబల్ హ్యూమన్ ఎక్సలెన్స్ అవార్డు, మరియు వివిధ సంస్థల చే సోషల్ అచీవర్ అవార్డు, గిడుగు రామ్మూర్తి పంతులు భాషా సేవా పురస్కారం, న్యూఢిల్లీ అదిరిలా ఫౌండేషన్ వారి సాహిత్య సేవా రత్న పురస్కారం, న్యూఢిల్లీ భారతీయ భాషా మంచ్ ( రవీంద్రనాథ్ ఠాగూర్ పురస్కారం) తో పాటు పలు బిరుదులను ముఖ్యమంత్రులు గవర్నర్లు, ప్రముఖుల చేతుల మీదుగా  అందుకున్నారు.  మరియు  సాహితీ వేదికల సమ్మేళనాల్లో పాల్గొన్నారు.చిటికెన గత సంవత్సరం కూడా హెచ్. .డబ్యూ. పి. ఎల్ సంస్థ ప్రపంచ శిఖరాగ్ర  సమావేశంలో పాల్గొన్నారు.
 ఈ సందర్భంగా చిటికెన మాట్లాడుతూ  సమాజశాంతితోనే ప్రపంచ శాంతి సాధ్యం అని సమాజం చైతన్యమైనప్పుడే ప్రపంచ మానవాళి సుఖశాంతులతో ఉంటుందని తనకు ఈ సంస్థ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానం అందుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని,
 ఈ నెల సెప్టెంబర్ 18వ ఆదివారం భారతీయ కాలమానం మధ్యాహ్నం 12 30 నిమిషాలకు  సమావేశం జరుగుతుందని, ఇట్టి సమావేశానికి సంస్థ అధ్యక్షులు మ్యాన్ హీలి మరియు సంధానకర్తగా సంస్థ ప్రతినిధులు, వ్యవహరిస్టారన్నారు. ఈ సందర్భంగా -డా.చిటికెనకు పలువురు   ప్రముఖులు, రచయితలు శుభాకాంక్షలు తెలియజేశారు.

0/Post a Comment/Comments